Actress Anjali: టాలీవుడ్ టాలెంటెడ్ నటి అంజలి.. ఇటీవల విడుదలైన "బహిష్కరణ" వెబ్ సిరీస్ తో (Bahishkarana Web Series) మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ప్రముఖ ఓటీటీ 'జీ 5' (Zee5) లో రిలీజైన ఈ సిరీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అంజలి ఇందులో వేశ్య పాత్ర పోషించింది. ఆ పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ.. తాజాగా ఈ సిరీస్ లో కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించడం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంజలి ఈ సిరీస్ లో తన పాత్రకు ఇంటిమేట్ సీన్స్ చాలా అవసరం తాను నమ్మినట్లు చెప్పింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.." కథకు అవి అవసరమని నేను నమ్మాను, అందుకే వాటిలో నటించడానికి నేను సిద్ధమైయ్యాను. 'నవరస' సిరీస్ చేసినప్పుడు కాస్ట్యూమ్ కారణంగా కొన్ని గంటలపాటు వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదు. అయితే ఈ సన్నివేశాలను చిత్రీకరించడం చాలా కష్టంగా ఉండటంతో అందరినీ బయటకు పంపించి, క్లోజ్ డోర్స్ వెనుక మాత్రమే ఈ సన్నివేశాలను చిత్రీకరించాము.
అవి చేసేటప్పుడు చాలా అసౌకర్యంగా అనిపించింది" అని చెప్పింది. దీంతో అంజలి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీశాయి. కొందరు ప్రేక్షకులు ఆమె ధైర్యాన్ని అభినందించగా, మరికొందరు ఈ సన్నివేశాలు అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో అంజలితో పాటూ అనన్య నాగళ్ల, శ్రీతేజ్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి.