Netflix Shares 'Rana Naidu' Season 2 Update : ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో విడుదలైన 'రానా నాయుడు' వెబ్‌సిరీస్ మొదటి సీజన్ విజయవంతమైన తర్వాత, రెండో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే అప్‌డేట్‌ను విడుదల చేసింది.
అప్‌డేట్‌లో ఏముంది?
ఒక యాక్షన్ సన్నివేశంతో కూడిన చిన్న వీడియోను షేర్ చేసింది నెట్‌ఫ్లిక్స్. ఈ వీడియోలో రానా దగ్గుబాటి (Rana Daggubati), విక్టరీ వెంకటేష్ (Hero Venkatesh) యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. రానా నాయిడు షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుఫుతుందని తెలిపారు. అయితే ఈ అప్డేట్ లో రెండో సీజన్ ఎప్పుడు విడుదలవుతుందో, కథ ఏమిటో నెట్‌ఫ్లిక్స్ ఇంకా వెల్లడించలేదు. కాగా ఈ చిన్న వీడియో సీజన్ 2 పై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.
Also Read : అల్లు అర్జున్ పై మెగా ఫ్యాన్స్ ట్రోలింగ్.. స్పందించిన హైపర్ ఆది, ఏమన్నాడంటే..?
మొదటి సీజన్ గురించి..
'రానా నాయుడు' అమెరికన్ క్రైం డ్రామా సిరీస్ 'రే డోనావన్'కు అధికారిక అడాప్టేషన్.మొదటి సీజన్‌లో రానా దగ్గుబాటి రానా నాయుడి పాత్రలో నటించగా.. విక్టరీ వెంకటేష్ అతని తండ్రి పాత్రలో కనిపించాడు. గత ఏడాది రిలీజైన ఈ సిరీస్ ఇండియా వైడ్ భారీ రెస్పాన్స్ అందుకుంది.
View this post on Instagram