Anjali: ఆ బోల్డ్ సీన్స్ కోసం నరకం చూశా.. వాష్‌రూమ్‌కు కూడా వెళ్లకుండా: అంజలి 'బహిష్కరణ' వెబ్ సిరీస్ లో ఇంటిమేట్ సీన్స్ చేయడంపై అంజలి స్పందించింది. ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో.." ఆ సీన్స్ చేసేటప్పుడు అందర్నీ బయటికి బయటకు పంపించి, క్లోజ్ డోర్స్ వెనుక షూట్ చేశాం. అవి చేసేటప్పుడు నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది" అని చెప్పింది. By Anil Kumar 23 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Actress Anjali: టాలీవుడ్ టాలెంటెడ్ నటి అంజలి.. ఇటీవల విడుదలైన "బహిష్కరణ" వెబ్ సిరీస్ తో (Bahishkarana Web Series) మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. ప్రముఖ ఓటీటీ 'జీ 5' (Zee5) లో రిలీజైన ఈ సిరీస్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. అంజలి ఇందులో వేశ్య పాత్ర పోషించింది. ఆ పాత్రలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ.. తాజాగా ఈ సిరీస్ లో కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో నటించడం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అంజలి ఈ సిరీస్ లో తన పాత్రకు ఇంటిమేట్ సీన్స్ చాలా అవసరం తాను నమ్మినట్లు చెప్పింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.." కథకు అవి అవసరమని నేను నమ్మాను, అందుకే వాటిలో నటించడానికి నేను సిద్ధమైయ్యాను. 'నవరస' సిరీస్ చేసినప్పుడు కాస్ట్యూమ్ కారణంగా కొన్ని గంటలపాటు వాష్‌రూమ్‌కు కూడా వెళ్లలేదు. అయితే ఈ సన్నివేశాలను చిత్రీకరించడం చాలా కష్టంగా ఉండటంతో అందరినీ బయటకు పంపించి, క్లోజ్ డోర్స్ వెనుక మాత్రమే ఈ సన్నివేశాలను చిత్రీకరించాము. Also Read : ఫుల్ స్వింగ్ లో ‘రానా నాయుడు’ సీజన్ 2 షూటింగ్.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్! అవి చేసేటప్పుడు చాలా అసౌకర్యంగా అనిపించింది" అని చెప్పింది. దీంతో అంజలి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీశాయి. కొందరు ప్రేక్షకులు ఆమె ధైర్యాన్ని అభినందించగా, మరికొందరు ఈ సన్నివేశాలు అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ముఖేష్ ప్రజాపతి దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో అంజలితో పాటూ అనన్య నాగళ్ల, శ్రీతేజ్ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ZEE 5, పిక్సల్ పిక్చర్స్ ఇండియా సంయుక్తంగా నిర్మించాయి. #zee5-ott-app #cinema-news #bahishkarana-web-series #actress-anjali మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి