Tamannah : విజయ్ వర్మతో పెళ్లి ... తమన్నా షాకింగ్ కామెంట్స్..!

నటి తమన్నా నటుడు విజయ్ వర్మ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం తాను పెళ్లి మూడ్‌లో లేనని. ఇప్పుడే చేసుకోవడం లేదు.. కంగారు పడొద్దంటూ చెప్పింది.

New Update
Tamannah : విజయ్ వర్మతో పెళ్లి ... తమన్నా షాకింగ్ కామెంట్స్..!

Actress Tamannah Shocking Comments On Marriage With Actor Vijay Varma : మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannah) టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. అటు బాలీవుడ్ (Bollywood) ఇటు టాలీవుడ్ (Tollywood) చిత్రాలతో తనదైన స్టైల్ లో దూసుకెళ్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే శ్రద్దా కపూర్ బ్లాక్ బస్టర్ హిట్ 'స్త్రీ 2' సినిమాలో శ్యామా పాత్రలో మెరిసిన ఈ బ్యూటీ.. 'ఆజ్ కీ రాత్' ఐటమ్ సాంగ్ లో తన హాట్ మూవ్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది.

విజయ్ వర్మతో ప్రేమ 

ఇది ఇలా ఉంటే తమన్నా తన ప్రేమ జీవితానికి సంబంధించి కూడా నిత్యం వార్తల్లో ఉంటుంది. ఇప్పటికే తమన్నా నటుడు విజయ్ వర్మ (Vijay Varma) తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు పబ్లిక్ చేయడంతో.. వీళ్ళ పెళ్లి గురించి సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతున్నాయి. అంతే కాదు చాలా ఈవెంట్ లలో తమన్నా ప్రియుడు విజయ్ వర్మతో కలిసి ర్యాంప్ పై వాక్ చేసిన ఫొటోలు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని అందరూ భావించారు.

పెళ్లి పై క్లారిటీ

ఈ క్రమంలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ (Hyderabad) లో ఓ షాప్ ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా హాజరైన తమన్నా ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ సందర్భంగా రిపోర్టర్స్ నటుడు విజయ వర్మతో తన పెళ్లి పుకార్ల పై ప్రశ్నించగా.. "ప్రస్తుతం తాను పెళ్లి మూడ్ లో లేనని. ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు.. కంగారుపడొద్దంటూ చెప్పింది." దీంతో ఈ జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుందన్న ఊహాగానాలకు చెక్ పడింది.

Also Read: HIT: The 3rd Case వచ్చేసింది.. నాని ఫస్ట్ లుక్ అదిరింది..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు