Tamil Nadu: దళపతి విజయ్ పార్టీకి అధికారిక గుర్తింపు.. 2026 ఎన్నికలే టార్గెట్ తమిళ స్టార్ హిరో, దళపతి విజయ్ స్థాపించిన పార్టీ 'తమిళగ వెట్రి కళగం'కు ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు వచ్చింది. పోల్ ప్యానెల్ చేసిన అభ్యర్థనకు ఏడు నెలల తర్వాత ఆమోదం లభించింది. By B Aravind 08 Sep 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి తమిళ స్టార్ హిరో, దళపతి విజయ్ స్థాపించిన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన స్థాపించిన పార్టీ 'తమిళగ వెట్రి కళగం'కు ఎన్నికల కమిషన్ నుంచి అధికారిక గుర్తింపు వచ్చింది. పోల్ ప్యానెల్ చేసిన అభ్యర్థనకు ఏడు నెలల తర్వాత ఆ పార్టీకి ఆమోదం లభించింది. గత నెలలో చెన్నై శివారు ప్రాంతమైన పనైయూర్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యలయంలో విజయ్.. పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. జెండాలో పైన, కింది భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులు ఉన్నాయి. Also Read: ఐఏఎస్ నుంచి పూజా ఖేద్కర్ తొలగింపు మధ్యలో ఎరుపురంగు వృత్తకారం ఉంది. దానిలోపల శిరీష పుష్పం, చుట్టు 28 నక్షత్రాలు ఉన్నాయి. అందులో ఐదు నీలం రంగులో, మిగతావి పచ్చ రంగులో ఉన్నాయి. అలాగే శిరీష పుష్పానికి రెండువైపుల ఘీంకరిస్తున్న ఏనుగు రూపాలు ఉన్నాయి. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడారు. ఇప్పటివరకు మన కోసం మనం శ్రమించామని.. ఇకనుంచి తమిళనాడు, తమిళ ప్రజల ఉన్నతి కోసం కలిసి శ్రమిద్దామని పిలుపునిచ్చారు. అలాగే 2026లో జరిగే రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని విజయ్ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో విజయ్ రాజకీయాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తారనేదానిపై ఆసక్తి నెలకొంది. #telugu-news #tamil-nadu #national-news #actor-vijay #dalapthy-vijay మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి