Actor Prudhvi Raj: అధ్వాన్నంగా జగన్ పాలన.. 2024లో జనసేన ప్రభంజనం ఖాయం

వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, ఏపీలో సీఎం జగన్ పాలన అధ్వాన్నంగా ఉందని జనసేన నాయకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్ విమర్శించారు. కమెడియన్ పృథ్వీ రాజ్ సొంతంగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్ వెళ్లారు. బోనకల్ లో టీవీ ఆర్టిస్ట్ బానోత్ శ్రీనివాస రావు ఇంటికి కొత్త రంగుల ప్రపంచం మూవీ యూనిట్ మొత్తం వెళ్లింది.

New Update
Actor Prudhvi Raj: అధ్వాన్నంగా జగన్ పాలన.. 2024లో జనసేన ప్రభంజనం ఖాయం

Actor Prudhvi Raj Hot Comments on CM YS Jagan: వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ (Janasena) ప్రభంజనం సృష్టిస్తుందని, ఏపీలో సీఎం జగన్ పాలన అధ్వాన్నంగా ఉందని జనసేన నాయకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్ విమర్శించారు. కమెడియన్ పృథ్వీ రాజ్ సొంతంగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్ వెళ్లారు. బోనకల్ లో టీవీ ఆర్టిస్ట్ బానోత్ శ్రీనివాస రావు ఇంటికి కొత్త రంగుల ప్రపంచం మూవీ యూనిట్ మొత్తం వెళ్లింది.

ఈ క్రమంలో సోమవారం అక్కడ మీడియాతో ఏపీ రాజకీయాలు, వచ్చే ఎన్నికలపై నటుడు పృథ్వీ రాజ్ తన అభిప్రాయాలను వెల్లడించారు. వైసీపీ (YCP) పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సీఎం జగన్ కు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ లో 2024లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో జనసేన తన ప్రభంజనం సృష్టించబోతుందన్నారు పృథ్వీ.

అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన 'బ్రో' (Bro movie) మూవీ వివాదంపై కూడా స్పందించారు. బ్రో సినిమాలో డైరెక్టర్ చెప్పినట్లు శ్యామ్ బాబు పాత్రలో నటించాను తప్ప వేరే వాళ్ల గురించి తెలియదన్నారు. ఇక కొత్త రంగుల ప్రపంచం సినిమాలో హీరోయిన్ గా తన కుమార్తె శ్రీ, హీరోగా తన మిత్రుడి కుమారుడు క్రాంతి నటించారని చెప్పారు. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూసి, తమను ఆదరించి, విజయవంతం చేయాలని పృథ్వీ రాజ్ కోరారు.

Also Read: తిరుపతి జిల్లా భాకారాపేట అడవిలో ఓ మైనర్‌ ప్రేమ జంట ఆత్మహత్య

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు