Actor Prudhvi Raj: అధ్వాన్నంగా జగన్ పాలన.. 2024లో జనసేన ప్రభంజనం ఖాయం
వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని, ఏపీలో సీఎం జగన్ పాలన అధ్వాన్నంగా ఉందని జనసేన నాయకుడు, సినీ నటుడు పృథ్వీరాజ్ విమర్శించారు. కమెడియన్ పృథ్వీ రాజ్ సొంతంగా దర్శకత్వం వహిస్తూ రూపొందించిన 'కొత్త రంగుల ప్రపంచం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఖమ్మం జిల్లా బోనకల్ వెళ్లారు. బోనకల్ లో టీవీ ఆర్టిస్ట్ బానోత్ శ్రీనివాస రావు ఇంటికి కొత్త రంగుల ప్రపంచం మూవీ యూనిట్ మొత్తం వెళ్లింది.