TS Govt Jobs : ఆ ఉద్యోగ ఖాళీల భర్తీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు!

ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాల భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే యూనివర్సీటిల్లో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఖాళీలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. మొత్తం పోస్టులు 2,825 ఉండగా 1,977 ఖాళీలున్నట్లు సమాచారం.

Telangana : బీఆర్ఎస్ బిల్లు రద్దు.. పాత పద్ధతిలోనే యూనివర్సిటీల నియామకాలు?
New Update

Revanth Sarkar : తెలంగాణ(Telangana) రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీల భర్తిపై రేవంత్(CM Revanth) సర్కార్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలు, ఇందుకు సంబంధించిన ఖాళీల భర్తీపై సమగ్ర నివేదికను ఇవ్వాలని ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు సమాచారం. కాగా ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా యూనివర్సిటీల్లో అధికారులు టీచింగ్‌(Teaching), నాన్‌ టీచింగ్‌(Non Teaching) పోస్టుల ఖాళీల వివరాలపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు.

ఆచరణలోకి రాని జీవో..
ఈ మేరకు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు సంబంధించి 2,825 టీచింగ్‌ పోస్టులు ఉన్నాయని, ఇందులో ప్రస్తుతం 848 మంది మాత్రమే పనిచేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక నాన్‌ టీచింగ్‌ పోస్టులు కూడా చాలా వరకు ఖాళీగా ఉండగా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ పోస్టులను భర్తీ చేయలేదు. 1,061 ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల(Assistant Professors) పోస్టుల భర్తీకి 2017లో జీవో నంబరు-34ను జారీ చేసినప్పటికీ అది ఆచరణలోకి రాలేదు. యూనివర్సిటీల్లోని ఖాళీలన్నింటినీ భర్తీ చేసేందుకు నియామక బోర్డును ఏర్పాటు చేస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించారు. కానీ ఆ బిల్లును గవర్నర్‌ ఆమోదించకపోవడంతో పరిశీలన కోసం రాష్ట్రపతికి పంపించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటంతో మరోసారి ఈ నియామకాలపై సందిగ్ధత నెలకొంది.

ఇది కూడా చదవండి : Vijay Sethupathi : ‘హిందీ రుద్దుడు..’ రిపోర్టర్‌పై హీరో విజయ్ సేతుపతి ఆగ్రహం!

20 వేల ఉద్యోగాలు..
అయితే ఇటీవలే యూనివర్సిటీల అభివృద్ధి కోసం, ఖాళీల భర్తీ కోసం చర్యలను ప్రారంభించాలని రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఫిబ్రవరిలో 20 వేల ఉద్యోగాలు భర్తీ చేయనుండగా ఈ ఖాళీలను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఉండాల్సి టీచింగ్ పోస్టులు, ఖాళీలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టులు, ఖాళీలు:

1. ఉస్మానియా: టీచింగ్ పోస్టులు-1267. ఖాళీల సంఖ్య- 891
2. కాకతీయ: పోస్టులు- 409, ఖాళీలు- 323.
3. జేఎన్ టీయూహెచ్: పోస్టులు- 409, ఖాళీలు- 323.
4. అంబేడ్కర్: పోస్టులు- 86, ఖాళీలు- 52.
5. తెలంగాణ: పోస్టులు-152, ఖాళీలు- 91.
6. జేఎన్ ఎన్ ఏఎఫ్ యూ: పోస్టులు- 55, ఖాళీలు 38.
7. పొట్టి శ్రీరాములు: పోస్టులు- 72, ఖాళీలు 58.
8. మహాత్మగాంధీ: పోస్టులు- 70, ఖాళీలు- 35.
9. పాలమూరు: పోస్టులు- 95, ఖాళీలు 74.
10. శాతవాహన: పోస్టులు- 63, ఖాళీలు 47.
11. ట్రిపుల్ ఐటీ: పోస్టులు- 146, ఖాళీలు 127.

మొత్తం పోస్టులు: 2,825 ఉండగా.. ఇందులో 1,977 ఖాళీలున్నాయి.

#universities #telangana #revanth-sarkar #teacher #vacancies
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి