Happy Birthday Nagarjuna: ఆరుపదుల నవమన్మధుడు. టాలీవుడ్ కింగ్

వయసు ఎప్పుడో 6 పదులు దాటింది. ఆ విషయం చెబితే తప్ప ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఎవరికైనా వయసు పెరిగితే వృద్ధాప్యం వస్తుంది. కానీ ఈయనకు మాత్రం వయసు పెరిగేకొద్దీ గ్లామర్ పెరుగుతుంది, అందం రెట్టింపు అవుతుంది, అతడే నవ మన్మధుడు నాగార్జున. అభిమానులు ముద్దుగా పిలిచే పేరు కింగ్.

Happy Birthday Nagarjuna: ఆరుపదుల నవమన్మధుడు. టాలీవుడ్ కింగ్
New Update

King Nagarjuna: మన్మధుడు అనే పదానికి నిర్వచనం నాగ్. విక్రమ్ నుండి రీసెంట్‌గా రిలీజైన ది ఘోస్ట్ వరకు నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి, తెలుగు ఆడియెన్స్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఫ్యాన్స్ పల్స్ తెలిసిన కింగ్ నాగార్జున ఈరోజు (ఆగస్ట్ 29) తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

1986లో విక్రమ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ ఇచ్చిన నాగార్జున (Nagarjuna), ఫస్ట్ సినిమాతోనే యాక్షన్ హీరో ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. ఆ తరవాత రిలీజైన ‘మజ్ను’ సినిమా నాగార్జునలోని మరో రొమాంటిక్ యాంగిల్‌ని ఎలివేట్ చేసింది. ఆ తరవాత రిలీజైన ‘కలెక్టర్ గారి అబ్బాయి’ సినిమాతో కంప్లీట్ కమర్షియల్ హీరో అనిపించుకున్న నాగార్జున, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫస్ట్ ఐదేళ్ళ కాలంలోనే ప్రొడ్యూసర్స్ ఫేవరేట్ హీరో అనిపించుకున్నాడు. ఈ పీరియడ్‌లోనే రిలీజైన ‘గీతాంజలి’ నాగ్ కరియర్‌లో ఆణిముత్యంగా నిలవగా, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘శివ’ (SHIVA) సినిమా, టాలీవుడ్ పాథ్ బ్రేకింగ్ మూవీగా నిలిచింది.

ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన నాగార్జున ‘సెల్యూలాయిడ్ సైంటిస్ట్’ అనిపించుకున్నారు. ఓ వైపు రక్షణ, నిర్ణయం, కిల్లర్, అంతం, క్రిమినల్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేస్తూనే, మరో వైపు హలోబ్రదర్, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఘరానా బుల్లోడు, రాముడొచ్చాడు, ఆవిడా మా ఆవిడే సినిమాలతో మాస్ టచ్ చేస్తూనే, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని కూడా అలరించారు.

publive-image

అప్పటివరకు యూత్, మాస్, ఫ్యామిలీ జోనర్స్‌లో ఆల్ రౌండర్ అనిపించుకున్న నాగార్జున ‘అన్నమయ్య’ సినిమాతో ఒక్కసారిగా అందరికీ చిన్నపాటి షాకిచ్చారు. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్‌తో స్టైలిష్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న నాగార్జున కరియర్‌లో ‘అన్నమయ్య’ సినిమా పెద్ద ప్రయోగమే. ఈ సినిమాతో తనలోని నట విశ్వరూపాన్ని ఎలివేట్ చేసిన నాగార్జున, మళ్ళీ ఇదే జోనర్‌లో శ్రీ రామదాసు, షిర్డీ సాయి, ఓంనమో వెంకటేశాయ సినిమాలతో కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్నాడు.

యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా సక్సెస్‌లో హైట్స్‌కి చేరుకున్న కింగ్, వయసు పెరుగుతున్నా తనలో గ్లామర్ ఏమాత్రం తరగలేదని ప్రూవ్ చేసుకుంటున్నారు. తన బర్త్ డే సందర్భంగా నా సామిరంగా అనే కొత్త ప్రాజెక్టు ప్రకటించిన నాగ్, ఈ సినిమాతో పాటు ఓ చిన్నపాటి ప్రయోగం చేస్తున్నారు. మరో కొరియోగ్రాఫర్‌కు ఛాన్స్ ఇచ్చారు. కింగ్ నాగ్ మరెన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుందాం.

 Action hero Nagarjuna's birthday celebrations

Also Read: Naa Saami Ranga: ఈసారి సంక్రాంతికి నాగ్ జాతర

#happy-birthday-nagarjuna-akkineni #happy-birthday-akkineni-nagarjuna #hero-nagarjuna-birthday #happy-birthday-nagarjuna #naa-saami-ranga #action-hero #birthday-celebrations #nagarjuna #nagarjuna-naa-saami-ranga-movie #happy-birthday-king-nagarjuna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి