Kodangal: కేటీఆర్ వద్దకు కొడంగల్ భూముల పంచాయితీ.. బలవంతంగా గుంజుకుంటున్నారని రైతులు ఆవేదన!

కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని సీఎం రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరిస్తున్నాడంటూ పలువురు రైతులు కేటీఆర్ తో ఆవేదన వ్యక్తం చేశారు. 3 వేల ఎకరాల భూమిని బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, తమకు అండగా నిలవాలంటూ వినతిపత్రం అందించారు.

Kodangal: కేటీఆర్ వద్దకు కొడంగల్ భూముల పంచాయితీ.. బలవంతంగా గుంజుకుంటున్నారని రైతులు ఆవేదన!
New Update

KTR: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కొడంగల్ (Kodangal) నియోజకవర్గంలో ఫార్మా కంపెనీల కోసం భూములు ఇవ్వాలని బెదిరిస్తున్నారంటూ పలువురు రైతులు కేటీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమకు అండగా నిలవాలని నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల రైతులు శుక్రవారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ కు వినతిపత్రం ఇచ్చారు. దుద్యాల్ మండలంలోని హకీంపేట్, పోలెపల్లి, లకచర్ల గ్రామంలో దాదాపు మూడు వేల ఎకరాల భూమిని రైతుల నుంచి బలవంతంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో మహిపాల్ ముదిరాజ్, ఇతర నాయకులు కేటీఆర్ ను కలిశారు. ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరుగుతుందని, తమకు ఈ ఫ్యాకర్టీలు వద్దని చెబుతున్నప్పటికీ సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా కంపెనీకి భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరని తమకు బీఆర్ఎస్ అండగా నిలవాలని కేటీఆర్ ను కోరారు. లక్షల కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పనంగా ప్రభుత్వం తమ వద్ద నుంచి లాక్కునేందుకు కుట్ర చేస్తుందన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన తమ కుటుంబాలకు ఈ భూమినే జీవనాధారంగా బతుకుతున్నాయన్నారు. ఈ భూములను గుంజుకుంటే తమ జీవితాలు సర్వనాశనం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున అండగా ఉంటామని కేటీఆర్ వారికి భరోసా ఇచ్చారు.

Also Read: మీ వివరణ తలా తోక లేనిది.. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రిపై షర్మిల ఫైర్!

#land #cm-revanth #kodangal #farmers #ktr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe