Guntur: 20 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల ఆంటీ ఎఫైర్.. పట్టించుకోవడం లేదని యాసిడ్ దాడి.. అసలేమైందంటే?

గుంటూరు జిల్లాలో యాసిడ్‌ దాడి కలకలం రేగింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడన్న అక్కసుతో మహిళ ఓ యువకుడుపై యాసిడ్ దాడి చేసింది . ఈ యాసిడ్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియుడు వెంకటేష్ ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Guntur: 20 ఏళ్ల యువకుడితో 45 ఏళ్ల ఆంటీ ఎఫైర్.. పట్టించుకోవడం లేదని యాసిడ్ దాడి.. అసలేమైందంటే?
New Update

అతనికి 20 ఏళ్లు... ఆమెకు 45 ఏళ్లు... వారిద్దరి మధ్య పరిచయం కాస్తా సహజీవనానికి దారితీసింది. కొన్ని నెలల తర్వాత యువకుడు ఆమెను దూరంపెట్టాడు. ఇది భరించలేని మహిళ యువకుడిపై ఏకంగా యాసిడ్ దాడికి పాల్పడడం సంచలనం సృష్టించింది. గుంటూరు శివారు నల్లపాడుకు చెందిన వెంకటేష్ వాటర్ క్యాన్లు సప్లై చేస్తుంటాడు. ఖమ్మంకు చెందిన రాధా రైలుపేటలో నివాసం ఉంటుంది. ఇద్దరికీ ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలం తర్వాత వెంకటేష్ రాధను దూరంగా ఉంచటం మొదలుపెట్టాడు. వెంకటేష్ తనతో మాట్లాడకపోవటం, తన వద్దకు రాకపోవడంతో రాధ ఆగ్రహించింది. ఎందుకు తనను దూరంగా పెడుతున్నావని ప్రశ్నించింది.

తనకు ఇష్టం లేదని చెప్పడంతో ఇద్దరు మధ్య వివాదం మొదలైంది. ఇదే విషయంపై వెంకటేష్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినా వెంకటేష్ దారిలోకి రాలేదు. తనని‌ కాదన్న వెంకటేష్‌పై కోపం పెంచుకుంది. వెంగళాయపాలెంలో వెంకటేష్ ఉన్నాడని తెలుసుకొని వెళ్ళిన రాధ తనతో పాటు తెచ్చుకున్న యాసిడ్‌ను వెంకటేష్‌పై పోసింది. తీవ్రగాయాలైన వెంకటేష్‌ను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంకటేష్ ను ఆ మహిళను మూడు నెలల క్రితం ఇంటికి తీసుకెళ్లగా అతని కుటుంబ సభ్యులు ఆమెను బయటకు పంపించివేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో తనపై వెంకటేష్‌, అతడి కుటుంబ సభ్యులు దాడి చేశారని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది రాధ. వెంకటేష్‌తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు అయింది.

మరో ముగ్గురు యువకులతో

దీంతో తనను బయటకు గెంటేశారని కక్ష పెంచుకుంది. మంగళవారం మరో ముగ్గురు యువకులతో కలిసి ఆటోలో రాధ వెళ్లింది. తాగునీటి డబ్బాలు దించుతున్న వెంకటేష్‌పై వెనక నుంచి రాధ యాసిడ్‌ పోసింది. అతడు బాధతో పెద్దగా ఒక్కసారే కేకలు వేయటంతో స్థానిక ప్రజలు అక్కడికి వచ్చారు. జనాలు వచ్చేలోపు వచ్చిన ఆటోలోనే రాధ పరారైంది. ఆ తర్వాత స్థానికులు బాధితుడిని జీజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న తనకు రాధ ఫోన్‌ చేసి చంపేస్తానని బెదిరించిందని బాధితుడు వెంకటేష్‌ ఆరోపిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు మహిళ రాధతో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. వారి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు..త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామన్నారు పోలీసులు.

#khammam #acid-attack #radhaa #venkatesh #guntur
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe