Telangana: సీసీఎస్ లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ చిక్కిన ఇనెస్పెక్టర్

తెలంగాణ సీసీఎస్‌లో 3 లక్షలు లంచం తీసుకుంటూ ఇన్‌స్పెక్టర్ సుధాకర్ ఏసీబీకి చిక్కారు. ఓకేస్ విషయంలో బాధితుడు దగ్గర 15లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న సుధాకర్ ఇప్పటివరకు 7 లక్షలు తీసుకున్నారు. బాధితుడు మరో 3లక్షలు ఇస్తుండగా ఏసీబీ సుధాకర్‌ను రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకుంది.

New Update
AP Pensions: పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ఆదేశాలు

తెలంగాణ సీసీఎస్‌లో లంచం తీసుకుంటూ రెడ్ హ్యండెడ్‌గా ఇన్‌స్పెక్టర్ సుధాకర్‌ను ఏసీబీ పోలీసులు పట్టుకున్నారు. వివాదంలో చిక్కుకున్న ఇంటి పత్రాలను ఇవ్వడానికి బాధితుని దగ్గర సుధాకర్ 15 లక్షల ఒప్పందం కుదుర్చుకున్నారు. మొదటి విడతలో 5 లక్షలు చెల్లించిన బాధితుడు...రెండో విడత కింద 3 లక్సలు ఇవ్వడానికి సీసీఎస్ కార్యాలయానికి వచ్చారు. ఈ క్రమంలో ఆఫీస్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ప్రదేశంలో సుధాకర్‌కు 3లక్షలు ఇస్తుండగా..ఏసీబీ అధికారులు అక్కడకు చేరుకున్నారు. వారిని గుర్తించిన సుధాకర్ అక్కడి నుంచి పరారవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఏసీబీ అధికారులు అతన్ని వెంబడించి మరీ పట్టుకున్నారు.

రెండు వారాల క్రితమే సిసిఎస్ లో ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో ఏసీపీ ఉమామహేశ్వరరావును ఏసీడీ అరెస్ట్ చేసింది.

Also Read:Khammam: ట్రైన్ సిగ్నల్స్ ట్యాంపరింగ్..పద్మావతి ఎక్స్ ప్రెస్ లో దారిదోపిడీ

Advertisment
Advertisment
తాజా కథనాలు