Shiva Balakrishna: శివబాలకృష్ణ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

అక్రమాస్తుల కేసులో ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ ఆరో రోజు పూర్తిస్థాయిలో సహకరించినట్లు తెలిసింది. ఒకవైపు అతని కుటుంబసభ్యులు, స్నేహితులను కలిపి ఏసీబీ అధికారులు విచారించడంతో సుమారు 120 ఎకరాల వివరాలు వెలుగులోకి వచ్చాయి.

New Update
Shiva Balakrishna: శివబాలకృష్ణ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు

Shiva Balakrishna: అక్రమ ఆస్తుల సంపాదన విషయంలో అరెస్ట్ అయిన HMDA మాజీ డైరెక్టర్‌ శివబాలకృష్ణ విచారణలో వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రేపటితో బాలకృష్ణ రిమాండ్ ముగియనుంది. శివబాలకృష్ణ HMDA డైరెక్టర్‌గా ఉన్నప్పుడు అడ్డగోలుగా ఇచ్చిన అనుమతులపై ఏసీబీ (ACB) ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో HMDA హెడ్‌ ఆఫీస్‌లో నిన్నటి నుంచి ఏసీబీ సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. శివబాలకృష్ణ అనుమతులిచ్చిన కీలక డాక్యుమెంట్స్‌ పరిశీలన చేస్తోంది. ORR చుట్టూ కొన్ని రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు ఇష్టమొచ్చినట్లు అనుమతులు ఇచ్చినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

Also Read: మూడు సినిమాలకే అంత అవసరమా బాసూ.. యానిమల్ డైరెక్టర్ తీరుపై విమర్శలు 

శంషాబాద్‌, ఘట్‌కేసర్‌ జోన్లలో పెద్ద ప్రాజెక్టులపై ఆరా తీస్తున్నారు. ముందు తిరస్కరించి తర్వాత ఆమోదం తెలపడంపై పీవోలు, ఏపీవోల నుంచి వివరాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. తొలిరోజు 20 నుంచి 30 వరకు ఫైళ్లని ఏసీబీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. దాదాపు 100 వరకు కీలక దస్త్రాలు గుర్తించినట్లు సమాచారం. రియల్‌ సంస్థలకూ నోటీసులిచ్చే యోచనలో యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సోదాలు మరో రెండ్రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

శివ‌బాల‌కృష్ణపై స‌స్పెన్షన్‌ వేటు...

రెరా కార్యర్శి (RERA secretary) శివ‌బాల‌కృష్ణపై స‌స్పెన్షన్‌ వేటు ప‌డింది. అతడిని స‌స్పెండ్‌ చేస్తూ హెచ్ఎండీఏ మెట్రో పాలిట‌న్ క‌మిష‌నర్ దాన కిశోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇటీవ‌ల శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ యాక్ట్‌లోని యూ/ఎస్‌ 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడాయన చంచ‌ల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రణాళిక విభాగం అధికారిగా కూడా శివబాలకృష్ణ గతంలో పనిచేశారు.

శివబాలకృష్ణ ఇల్లు, బంధువులు, స్నేహితుల ఇండ్లలో 16 చోట్ల సోదాల అనంతరం మొత్తం రూ.99,60,850 నగదు, 1,988 గ్రామాలు బంగారం, వజ్రాలతో కూడిన భరణాలతో పాటు దాదాపు 6 కిలోల వరకూ వెండి నగలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు రూ.5,96,27,495 విలువైన చర, స్థిర ఆస్తులను గుర్తించారు. సోదాల్లో లభించిన మొత్తం స్థిర, చర ఆస్తులు ప్రభుత్వ విలువ ప్రకారమే రూ.8,26,48,999 ఉంటాయని, అయితే, మార్కెట్‌లో వాటి విలువ రూ.వందల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో శివబాలకృష్ణ ఎక్కువగా భూములు (Lands) కొన్నట్లు ఏసీబీ గుర్తించింది. హైదరాబాద్‌ శివార్లతోపాటు కొడకండ్ల, కల్వకుర్తి, యాదాద్రి, జనగామల్లో వాటిని గుర్తించారని సమాచారం. దీంతోపాటు కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు కూడా పెట్టినట్లు సమాచారం. ఇంకా అదనపు ఆస్తులకు సంబంధించి పరిశీలనలు జరుగుతున్నాయి.

DO WATCH:

Advertisment
తాజా కథనాలు