Chandrababu Case Updates: చంద్రబాబుకు బిగ్ డే.. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం వరకు.. 6 తీర్పులు రేపే!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏసీబీ కోర్టు నుంచి మొదలుకుని హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు రేపే వెలువడనున్నాయి. రేపు ఆయనకు ఊరట లభించకపోతే మరికొన్ని రోజులు జైలులోనే ఉండే అవకాశం ఉంది.

New Update
Chandrababu Case Updates: చంద్రబాబుకు బిగ్ డే.. ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం వరకు.. 6 తీర్పులు రేపే!

Chandrababu Case Updates: స్కిల్ డవలప్మెంట్ కేసులో (Skill Development Case) అరెస్ట్ అయి జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (Chandrababu Naidu) సంబంధించి రేపు.. అంటే సోమవారం అత్యంత కీలకంగా మారనుంది. ఏసీబీ కోర్టు (ACB Court) నుంచి మొదలుకుని హైకోర్టు (High Court), సుప్రీంకోర్టు (Supreme Court) వరకు చంద్రబాబు దాఖలు చేసిన పలు పిటిషన్లపై విచారణలు, తీర్పులు రేపే వెలువడనున్నాయి. దీంతో రేపు ఏం జరగబోతుందోన్న ఉత్కంఠ టీడీపీ (TDP) శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థకు సంబంధించి సీఐడీ (CID) తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌పై సోమవారం(ఈనెల 9న) విచారణ జరగనుంది. ఇదే కేసులో తనకు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు వేసిన పిటిషన్‌పై కూడా విజయవాడలోని ఏసీబీ కోర్టు సోమవారమే నిర్ణయాన్ని వెల్లడించనుంది.
ఇది కూడా చదవండి: AP Government: ఏపీలో బీసీ మహిళా అధికారికి అన్యాయం.. అంతా ఆ మంత్రి కారణంగానే?

దీంతో పాటు మరోసారి 'పోలీసు కస్టడీ'కి కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై సైతం రేపే ఏసీబీ కోర్టు ఉత్తర్వులను జారీ చేయనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసిన విషయం తెలిసిందే. ఇంకా.. హైకోర్టులోనూ చంద్రబాబుకు సంబంధించిన మూడు బెయిలు పిటిషన్లపై సోమవారం తీర్పులు వెల్లడికానున్నాయి.

రాజధాని అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (Amaravati Inner Ring Road), అంగళ్లు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో బెయిలు కోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను రిజర్వు చేశారు. ఈ మూడు పిటిషన్లపై న్యాయమూర్తి సోమవారం నిర్ణయం వెల్లడించనున్నారు.
ఇది కూడా చదవండి: AP Government: ఏపీలో బీసీ మహిళా అధికారికి అన్యాయం.. అంతా ఆ మంత్రి కారణంగానే?

దీంతో పాటు ఈ నెల 10న ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విషయంలో నారా లోకేష్ సీఐడీ ఎదుట విచారణకు హాజరుకానున్నారు. దీంతో ఆయనను అదే రోజు అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు, ఎల్లుండి జరిగి పరిణామాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు