Janmabhoomi Express : జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ నుంచి వేరుపడ్డ ఏసీ బోగీలు.. నరకం చూసిన ప్రయాణికులు!

శాఖ - హైదరాబాద్‌ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బయల్దేరిన రెండు నిమిషాలకే రైలు నుంచి రెండు ఏసీ బోగీలు విడిపోవడంతో రైలును నిలిపేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Janmabhoomi Express : జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ నుంచి వేరుపడ్డ ఏసీ బోగీలు.. నరకం చూసిన ప్రయాణికులు!
New Update

AC Coaches Cut Off : విశాఖ - హైదరాబాద్‌ (Visakha - Hyderabad) జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు (Janmabhoomi Express Train) లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో రైలును విశాఖలో ఆపేశారు. విశాఖలో ఉదయం 6.20 గంటలకు బయల్దేరిన 2 నిమిషాలకే ఏసీ బోగీ లింక్‌ తెగిపోగా.. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది రైలును విశాఖ స్టేషన్‌కు తీసుకువచ్చారు. సాంకేతిక సమస్య (Technical Issue) తో 2 ఏసీ బోగీలు రైలు నుంచి విడిపోయాయని అధికారులు వెల్లడించారు.

సమస్యను పరిష్కరించాక రైలును పంపిస్తామని తెలిపారు. ఉదయం నుంచి రైలు విశాఖలోనే ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య తలెత్తిన రెండు ఏసీ కోచ్‌లు తొలగించి వేరేవాటిని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఆ తర్వాతే విశాఖ నుంచి రైలు బయలుదేరనుంది. ఇప్పటికే 3 గంటలు ఆలస్యం అయింది. ఎప్పుడు బయలుదేరుతుందో అధికారులు స్పష్టంగా చెప్పకపోవడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read: 300 మంది భారతీయులు అరెస్ట్‌.. ఎక్కడో.. ఎందుకో తెలుసా!

#technical-issue #vizag #hyderabad #janmabhoomi-express
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe