/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/22-jpg.webp)
AC Blast in Kalyan Jewellers: అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్గారు. కర్ణాటకలోని (Karnataka) బళ్ళారిలోని కల్యాణ్ జ్యుయెలర్స్‌లో ఒక్కసారిగా పెద్ద పేలుడు వినిపించింది. ఇది భారీగా ఉండండతో షాపు కిటికీ అద్దాలు సైతం పగిలిపోయాయి. షాపులో ఉన్న ఒక ఏసీ పేలిపోవడంతో అక్కడ భీభత్సం జరిగింది. దీంట్లో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా కూడా ఉంది.
సాయంత్రం ఆరు గంటలప్పుడు..
ఇదేదో రాత్రి పూట జరిగింది కాదు. కల్యాణ్ జ్యూయెలర్స్ షాపు తెరిచి ఉండగానే...జనాలు అందులో ఉన్నప్పుడే ప్రమాదం సంభవించింది. సాయంత్రం ఆరు గంటలప్పుడు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా పేలుడు శబ్ధం వినిపించడంతో ఏం జరిగిందోనని.. షాపులోని కస్టమర్లు భయాందోళనలతో పరుగులు తీశారు. సెంట్రల్ ఏసీ గ్యాస్ రీఫిల్లింగ్ సమయంలో పేలుడు సంభవించిందని చెబుతున్నారు. పేలుడు జరిగిన వెంటనే సమాచారమందుకొన్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు వల్ల చెలరేగిన మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఏసీ పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read:West Bengal: వెస్ట్ బెంగాల్ గవర్న్ మీద లైగింక వేధింపు ఆరోపణలు