BRS Survey : త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలపై(Lok Sabha Elections 2004) ఏబీపీ, సీ-ఓటర్ ఒపీనియన్ పోల్(ABP-CVoter Opinion Poll) విడుదల చేసింది. తెలంగాణలో 17 సీట్లపై అంచనాలు వెల్లడించింది ఈ సంస్థ. సీట్లతో పాటు ఓట్ల శాతంపైనా కూడా తన అంచనాలు చెప్పింది. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్ 9 నుంచి 11 స్థానాల్లో గెలుస్తుందని సీ-ఓటర్ తెలిపింది. బీఆర్‌ఎస్ 3 నుంచి 5 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ 1-3 స్థానాలు మాత్రమే గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇతరులు 1 నుంచి 2 స్థానాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: KCR : కేసీఆర్ సంచలన నిర్ణయం.. వారికి ఎంపీ టికెట్ కట్?
ఈ సర్వే లెక్కలను పరిశీలిస్తే.. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ(BJP), కాంగ్రెస్ భారీగా ఓట్ల శాతాన్ని పెంచుకునే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఓట్ల శాతం భారీగా తగ్గే అవకాశం ఉందని సర్వే తెలిపింది. కాంగ్రెస్ 38 శాతం, బీఆర్‌ఎస్ 33 శాతం, బీజేపీ 21శాతం ఓట్లు సాధిస్తుందని ఈ సర్వే సంస్థ అంచనా వేసింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 29.79 శాతం, బీఆర్‌ఎస్‌కి 41.71 శాతం, బీజేపీకి 19.65 శాతం ఓట్లు వచ్చాయి.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39.4 శాతం ఓట్లు రాగా.. బీఆర్‌ఎస్‌కు 37.4 శాతం, బీజేపీకి 13.9 శాతం ఓట్లు వచ్చాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం మరింత పెరిగే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేస్తోంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఓట్ల శాతం తగ్గుతుందని అంచనా వేస్తోంది ఈ సర్వే.