హర్యానాలో ఈ ఏడాది అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించింది. శనివారం ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్.. 'కేజ్రీవాల్ కీ గ్యారంటీ'లను ప్రకటించారు. ఆప్ సీనియర్ నేత సంజయ్ సింగ్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్‌తో కలిసి ఆమె ఈ ప్రకటన చేశారు. హామీల్లో భాగంగా.. ఆప్ అధికారంలోకి వస్తే 24 గంటల ఉచిత విద్యుత్, కుటుంబంలో అందరికి ఉచిత వైద్యం, పిల్లలకు నాణ్యమైన విద్య, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, అలాగే మహిళలను నెలకు రూ.1000 అందిస్తామని తెలిపారు.
Also Read: ఆశ్చర్యం.. పుట్టుకతోనే చిన్నారికి 32 రెండు పళ్లు..
ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం అనేక మార్పులు తీసుకొచ్చిందని.. సునీతా కేజ్రీవాల్ తెలిపారు. అలాగే ఢిల్లీలో ఆరోగ్య, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సంబంధించిన విషయాలను వివరించారు. కేజ్రీవాల్ హర్యానాలోనే పుట్టి పెరిగారని.. ఏమి చేయలని దశ నుంచి పార్టీని ప్రారంభించి ఢిల్లీకి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. పెద్ద పెద్ద నాయకులు చేయలేని మంచిపనులు కేజ్రీవాల్ చేశారన్నారు. ఆయన చేసిన మంచిపనులు ప్రజలు గుర్తిస్తున్నారని తెలిపారు.
ఇదిలాఉండగా.. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉంటున్నారు. హర్యానాలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన సతీమణి సునితా కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ అన్ని స్థానాల నుచి పోటీ చేయనుంది. ఆ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరగనున్న ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
Also Read: క్లాస్ రూమ్‌లో కూలిన గోడ.. ఫస్ట్ ఫ్లోర్ నుండి కింద పడ్డ విద్యార్థులు..