DELHI LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుల జాబితాలో ఆప్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మరో కొత్త పరిణామం చోటు చేసుకోనుంది. ఈ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆప్ ను ఎందుకు నిందితుల జాబితాలో చేర్చలేదని సుప్పీంకోర్టు అడిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.

New Update
DELHI LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ కేసు నిందితుల జాబితాలో ఆప్
Delhi liquor scam Case: ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ (ED) మరింత ఫోకస్ పెట్టింది. నిన్న ఆప్ ఎంపీ సంజయ్సింగ్ ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆయనను అరెస్ట్ కూడా చేసింది. ఈరోజు మొత్తం ఆ పార్టీనే నిందుల జాబితాలోకి చేర్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీకి అంత పెద్ద ఎత్తున అక్రమంగా నిధులు వచ్చినప్పుడు...నిందితుల లిస్ట్‌లో ఎందుకు చేర్చలేదని సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యల ఆధారంగానే ఆ పార్టీని అక్యూజ్డ్‌గా చేర్చేందుకు అవసరమైన కసరత్తు

మొదలు పెట్టింది ఈడీ. దీని కోసం లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటోంది. ఈ కేసులో Prevention of Money Laundering Act (PMLA) కింద ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసింది.

ఇప్పటికే అరెస్ట్ అయిన మనీశ్ సిసోడియా (Manish Sisodia) బెయిల్ కోసం పిటిషన్‌లు పెట్టుకుంటూనే ఉన్నారు. ఇంతవరకూ లైన్ క్లియర్ కాలేదు. ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ని నిరాకరించింది. ఈ తీర్పుని సవాల్ చేస్తూ...సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సిసోడియా. ఈ పిటిషన్‌ని విచారించిన సమయంలోనే ఆప్ పార్టీ గురించి సుప్రీంకోర్టు ప్రశ్న వేసింది. సంజయ్ సింగ్‌కి (Sanjay Singh) కోట్ల రూపాయల డబ్బులు అక్రమంగా వచ్చాయని ఈడీ తేల్చి చెప్పింది. అప్రూవర్‌గా మారిన దినేశ్ అరోరా చెప్పిన ఆధారాలతో విచారణ చేపట్టిన ఈడీ..ఈ మేరకు ఆయనకు కోట్లు వచ్చినట్టు తేల్చింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని స్పష్టం చేసింది. ఇదే విషయమై ఈడీ అధికారులు సీబీఐకి లేఖ రాశారు.

మరోవైపు సంజయ్ సింగ్ను అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో ఆప్ ఆందోళనకు దిగింది. ఇప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ముగ్గురునేతలు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాలే అంటున్నారు ఢిల్లీ బీజెపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా. ఏది ఏమైనా ఇప్పటికే నిందితుల జాబితాలో ఆప్‌ను చేర్చితే కేజ్రీవాలకు మరిన్ని కష్టాలు ఎదుర్కొనక తప్పని పరిస్థితి.

also read:హైదరాబాద్‌, చెన్నైల్లో పెద్ద ఎత్తున ఐటీ రైడ్స్

తెలంగాణ బీజెపీలో రెబల్స్ బాంబ్ పేలడానికి రెడీగా ఉందా?

Advertisment
తాజా కథనాలు