సాధారణంగా కొందరు బడా కార్పొరేట్‌వేత్తలు, రాజకీయనాయకులు చేసే భారీ కుంభకుణాలు బయటపడటం చూస్తూనే ఉంటాం. అయితే వియాత్నంలో ఓ మహిళ భారీ కుంభకోణానికి పాల్పడటం ఆ దేశాన్నే కుదిపేస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్థిరాస్తి వ్యాపార దిగ్గజంగా పేరుపొందిన ఆ మహిళ ఏకంగా 12.5 బిలయాన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా ప్రజల సొమ్మును కాజేసింది. దీంతో ఆమె వల్ల ఎంతోమంది వియత్నం ప్రజలు మోసపోవడం కలకలం రేపుతోంది.
Also Read: ‘నన్ను క్షమించండి’ 😢.. ఎమోషనల్ అయిన మార్క్ జూకర్‌బర్గ్
బ్యాంకుకి కన్నం
అయితే వియత్నాంలో ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్ 'వాన్ తిన్హ్ పాట్' అనే కంపెనీకి చెందిన ఛైర్‌పర్సన్ ట్రుయాంగ్ మై లాన్ అనే మహిళకు అక్కడి సైగాన్ కమర్షియల్ బ్యాంకులో దాదాపు 90 శాతం వాటా ఉంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ బ్యాంకులో ఆమె మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఫేక్ రుణ దరఖాస్తులు పెట్టి ఏకంగా కోట్లాది రూపాయలు తీసుకున్నారు. కానీ వాటిని తిరిగి చెల్లించకపోవడం వల్ల ఆ బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. దీంతో ఆ బ్యంకులో డబ్బులు దాచుకున్న 42 వేల మంది సామాన్యులపై ఈ ప్రభావం పడటం ఆందోళన కలిగిస్తోంది.
బాధితుల నిరసన
2018 నుంచి 2022 మధ్య మైలాన్.. మొత్తం 916 ఫేక్ అప్లికేషన్లు సృష్టించి బ్యాంకు నుంచి ఏకంగా 304 ట్రిలియన్ డాంగ్‌లు (వియత్నాం) తీసుకొన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మొత్తం 12.5 బిలియన్ డాలర్ల కన్న ఎక్కువే. 2022లో ఈ భారీ కుంభకోణం బయటపడగా.. ఆ ఏడాది అక్టోబర్‌లో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అప్పటినుంచి బ్యంకు డబ్బులు స్తంభించిపోయాయి. వేలాదిమంది బాధితులు రోడ్లేక్కి నిరసనలు చేస్తునే ఉన్నారు. అయితే ఈ స్కామ్‌లో మై లాన్‌తో పాటు 85 మందికి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో బ్యాంకు మాజీ ఎగ్జిక్యూటివ్‌లు, ప్రభుత్వ మాజీ అధికారులు కూడా ఉండటం గమనార్గం. అయితే లాన్ సంపద విలువ 2022 నాటికి వియత్నాం జీడీపీలో 3 శాతం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Also Read: వరల్డ్‌లో అత్యంత తక్కువ అవినీతి దేశాల లిస్ట్‌లో భారత్ ఎక్కడుందో తెలుసా?