Watch : రాహుల్ ది ఆల్‎రౌండర్..చాక్లెట్ కూడా రెడీ చేసేసాడుగా...!!

రాజకీయాలతో బిజీగా బిజీగా గడిపే కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ..కొంత కాలంగా ప్రజలతో మమేకం అవుతూ కనిపిస్తున్నారు. మొన్న లఢఖ్ లో సందడి చేసిన రాహుల్...తాజాగా ఊటీలోని చాక్లెట్ ఫ్యాక్టరీలో దర్శనమిచ్చారు. అక్కడ కార్మికులతో కలిసి చాక్లెట్ ఎలా తయారు చేస్తారో నేర్చుకుని...తాను కూడా ఒక చాక్లెట్ రెడీ చేశారు. రాహుల్ చాక్లెట్ తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో చూసిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు..మా నేత ఆల్ రౌండర్ అంటూ తెగ మురిసిపోతున్నారు.

Watch : రాహుల్ ది ఆల్‎రౌండర్..చాక్లెట్ కూడా రెడీ చేసేసాడుగా...!!
New Update

Rahul prepared chocolate : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గత కొంతకాలంగా వరుస టూర్లతో బిజీగా మారారు. రాజకీయాలు పక్కన పెట్టిన ప్రజలకు మమేకం అవున్నారు. మొన్న లఢఖ్ లో బైక్ రైడ్ చేస్తూ సందడి చేసిన రాహుల్...ఇప్పుడు ఊటిలోని ఛాక్లెట్ ఫ్యాక్టరీలో ప్రత్యక్షమయ్యారు. చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించిన రాహుల్..అక్కడి కార్మికులతో కలిసి ముచ్చటించారు. అనంతరం చాక్లెట్ ఎలా తయారు చేస్తోరో నేర్చుకున్నారు. తాను కూడా ఒక చాక్లెట్ తయారు చేశాడు. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే రాహుల్ ఇలా ప్రజలతో మమేకం అవడం అటు పార్టీ వర్గాలను ..ఇటు కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.

ఇది కూడా చదవండి: సన్నగా, పీలగా ఉన్నారా? ఈ గింజలు పాలలో కలపుకుని తాగితే మీరే బాహుబలి..!!

వయనాడ్ వెళ్తూ రాహుల్...మార్గ మధ్యలో ఊటీలో ఓ చాక్లెట్ ఫ్యాక్టరీని సందర్శించి...అక్కడి మహిళ కార్మికులతో చాలా సేపు ముచ్చటించారు. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ విజయవంతంగా నడుస్తుందని..అక్కడ పనిచేసేవారు అంతా మహిళా కార్మికులే అని తెలసుకున్న రాహుల్..వారిపై ప్రశంసలు కురిపించారు. ప్రసిద్ధి చెందిన బ్రాండ్‌లలో ఒకటైన మోడ్డీస్ చాక్లెట్‌లను సందర్శించిన ఆనందకరమైన అనుభవం నాకు కలిగింది" అని రాహుల్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పూర్తి వీడియోను పంచుకుంటూ చెప్పాడు.

ఈ చిన్న వ్యాపారం..మురళీధర్ రావు, స్వాతి దంపతుల వ్యవస్థాపక స్ఫూర్తి స్ఫూర్తిదాయకం. వారితో పాటు పనిచేసే మహిళా బృందం కూడా అంతే గొప్పది. 70 మంది మహిళలు నేను ఇప్పటివరకు రుచి చూడనటువంటి అత్యంత సున్నితమైన కోవర్చర్ చాక్లెట్‌లను రూపొందించారు అంటు రాహుల్ పేర్కొన్నారు. అటు ఈ ఫ్యాక్టరీపై ఎంత జీఎస్టీ విధిస్తారంటూ రాహుల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఈ ఫ్యాక్టరీకి 18శాతం జీఎస్టీ కడుతున్నామంటూ యాజమాన్యం చెప్పడంతో ...ఈ సమస్య మీ ఒక్కరిది కాదని..దేశం మొత్తానికి ఇదే సమస్య అన్నారు. అనంతరం ఓ చిన్నారి నుంచి రాహుల్ ఆటో గ్రాఫ్ కూడా తీసుకున్నారు. మురళీధర్ రావు, స్వాతిల పిల్లలు వారి భవిష్యత్తు అభివృద్ధి చెందే భారతదేశానికి అర్హులని రాహుల్ అన్నారు.

ఇది కూడా చదవండి: చంద్రయాన్‌-3 బాడీ పెయింటింగ్‌ ఫొటోలు వైరల్‌.. మీరు కూడా ఓ లుక్కేయాల్సిందే!

#rahul-prepared-chocolate #tamil-nadu #chocolate #ooty #rahul-gandhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe