Ooty, Kodaikanal: ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నారా..అయితే ఈ పాస్ తప్పనిసరి!
ఊటీ, కొడైకెనాల్ లో సేద తీరాలనుకునే పర్యాటకులకు మంగళవారం నుంచి తమిళనాడు ప్రభుత్వం జారీ చేసే ఈ పాస్ తప్పనిసరి చేసింది. మే 7 నుంచి జూన్ 30 వరకు నీలగిరి, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకులను తీసుకెళ్లే వాహనాలను అనుమతించడానికి ఈ-పాస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.