ఓ వ్యక్తి ఎలాంటి భయం, జంకు లేకుండా భారీ నాగుపాముకు స్నానం చేయిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. బాత్‌రూంలో పాముకు నీళ్లతో కడుగుతున్న ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. అయితే.. పాములకు సెల్ఫ్ ప్రొటెక్షన్‌గా చర్మం రూపొందుతుందని.. దానికి స్వయంగా శుభ్రపరుచుకునే వ్యవస్ధ ఉంటుంది. కాగా అసలు నిప్పుతో చెలగాటమాడాల్సిన అవసరం ఏముంది..? అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. అయితే..19 సెకండ్ల వ్యవధిలో ఈ వీడియోలో ఓ వ్యక్తి మగ్ నుంచి నీటిని కోబ్రాపై పోస్తుండటం కనిపిస్తోంది. ఓ వీడియోలో ఆ వ్యక్తి పాము తలను పట్టుకుని స్నానం చేయించడం చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తోంది.
అయితే.. చాలా మందికి పాము అనే మాట వింటేనే ఒళ్లు జలదరిస్తోంది. చుట్టు పక్కలలో కనిపిస్తేనే ఎంతగానే కంగారు పడతాము. ఇక మన దగ్గరకు వచ్చినా.. మన కళ్లకు దగ్గరలో కనిపించినా..ఏం ఆలోచించకుండా పరుగులు పెట్టి ప్రాణాలు కాపాడుకుంటాము అంత భయం పాము అంటే. అయితే.. ఈ పాములకు వాటిని రక్షించుకోవడానికి, శుభ్రంగా ఉంచుకునే చర్మాన్ని కలిగి ఉంటాయి. ఈ పాములకు అది కాలానుగుణంగా తొలగిపోతుంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తూ.. ఆ వ్యక్తి కింగ్ కోబ్రా తలని పట్టుకోవడం చూసి ధైర్యాన్ని ప్రశంసించారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 12 వేల వ్యూస్ వచ్చాయి.
రెచ్చిపోయిన పాము
రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి తన వాహనంపై వెళ్తుండగా దారిలో ఓ పాము రోడ్డుకు అడ్డంగా కనిపించింది. ఇలాంటి సందర్భాల్లో దాన్ని అదిరించి, బెదిరించి దానిని అక్కడ నుంచి తోలేందుకు ప్రయత్నిస్తారు.కానీ పాము పగడపై కాల్చేందుకు యువకుడు ప్రయత్నించాడు. అయితే.. అతడి గురితప్పడంతో పాము ప్రాణాలతో బయపడింది. అ తర్వాత అతడి వైపు దూసుకురావడంతో అతడి బెంబేలెత్తిపోయి అక్కడి నుంచి పారిపోయాడు. రెండోసారి గురి తప్పగానే రెచ్చిపోయిన పాము కారులో ఉన్న అతడివైపు దూసుకుంటూ వచ్చేసింది. దీంతో రికార్డు చేస్తున్న అతడు ఒక్కసారిగా కంగారు పడిపోయాడు. వెంటనే కారును స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే..ఈ వీడియో చూసిన నెటిజన్లు అతడి పరిస్థితికి నవ్వుకుంటూనే తిట్టిపోశారు. ఓ మూగ జీవిపై అలా అకారణంగా కాల్పులకు దిగడం నచ్చలేదని కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.
ఇది కూడా చదవండి: ఏలూరులో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు… ఆన్‌లైన్ పేరుతో టోకరా