Suryapet : సూర్యాపేట జిల్లా(Suryapet District) లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మోతె(Mothe) సమీపంలో ఆటో, బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయారు. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
15 మంది కూలీలు..
ఈ మేరుకు మోతె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మునగాల మండలం రామసముద్రానికి చెందిన 15 మంది కూలీలు బురకచెర్ల గ్రామానికి మిరపకోత పనుల కోసం ఆటోలో బయలుదేరారు. ఈ క్రమంలోనే వారు సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారి అండర్ పాస్ వంతెన వద్దకు రాగానే వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొట్టింది.
ఇది కూడా చదవండి: Betting App: యువకుడి ప్రాణాలు తీసిన ఆన్ లైమ్ గేమ్.. తండ్రి మందలించినా వినకుండా!
ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించాం. అయితే చికిత్స అందిస్తుండగా సౌభాగ్యమ్మ అనే మహిళ ఆస్పత్రిలోనే చనిపోయారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు మధిర డిపోకు చెందినదిగా గుర్తించగా దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.