Health Tips : ఎనర్జీ డ్రింక్స్‌ తాగుతున్నారా.. ప్రమాదంలో పడ్డట్లే..

ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల యువతీ, యువకుల్లో నిద్ర నాణ్యత, నిద్ర లేమికి దారితీస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. ఎనర్జీ డ్రింక్స్‌ను ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువగా రాత్రి నిద్రకు భంగం కలుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. నెలకు 1-3 సార్లు తాగినా మప్పు పెరుగుతుందని తెలిపారు.

New Update
Health Tips : ఎనర్జీ డ్రింక్స్‌ తాగుతున్నారా.. ప్రమాదంలో పడ్డట్లే..

Energy Drinks : చాలామంది అలసిపోయినప్పుడు శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్(Energy Drinks) తాగుతుంటారు. కాని యువతీ, యువకులు వీటితో జాగ్రత్తగా ఉండాలని.. నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కళాశాలలో చదివే విద్యార్థుల్లో నిద్ర నాణ్యత తగ్గడానికి, అలాగే నిద్రలేమి(Poor Quality Of Sleep) కి దారితీస్తున్నట్లు నార్వేకి చెందిన ఓ అధ్యయనంలో తేలింది. ఎనర్జీ డ్రింక్స్‌ను ఎంత ఎక్కువ తాగితే అంత ఎక్కువగా రాత్రి నిద్రకు భంగం కలుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. నెలకు కనీసం 1-3 సార్లు తాగినా కూడా నిద్రాభంగం మప్పు పెరుగుతందని తెలిపారు.

Also Read: ఉదయం ఇవి తింటే గుండె జబ్బులతో పాటు డయాబెటిస్ వస్తాయి!

నిద్రకు ప్రభావం

వాస్తవానికి ఎనర్జీ డ్రింక్స్‌లో విటమిన్లు, చక్కెర, ఖనిజాలతో పాటు కెఫీన్‌ కూడా ఉంటుంది. సగటున ఒక లీటరుకు 150 మిల్లీ గ్రాముల కెఫీన్‌ కలుపుతుంటారు. అయితే ఇవి శారీరక, మానసిక శక్తిని అందిస్తాయని ప్రచారం చేయడం వల్ల ముఖ్యంగా విద్యార్థులు, యువత వీటికి ఎక్కువగా అట్రాక్ట్‌ అవుతున్నారు. కెఫీన్ నిద్రకు భంగం కలిగిస్తుంది. అయితే ఈ ఎనర్జీ డ్రింక్స్ నిద్రను తగ్గిస్తాయని పలు అధ్యయనాలు చెబుతున్నప్పటికీ అవి ఎంత వరకు ప్రభావం చూపుతాయనేది ఇంకా తెలియదు. అయితే దీన్ని గుర్తించేందుకు 18-35 ఏళ్లకు చెందిన 53,266 మందిపై సర్వే చేశారు.

అరగంట తక్కువగా నిద్ర

వీళ్లు ఎంత ఎక్కువగా ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారు.. ఎంత బాగా నిద్రపోతున్నారు(Sleeping) అనే విషయాలను పరిశీలించారు. ఈ డ్రింక్స్‌ను తాగనివారు.. ఎప్పుడు అప్పుడు తాగేవారితో పోలిస్తే.. రోజూ తాగేవారు సుమారు అరగంట పాటు తక్కువగా నిద్రపోతున్నట్లు తేలింది. నిద్ర పట్టిన తర్వాత మెలుకువ రావడం.. చాలాసేపటిదాక మళ్లీ నిద్రపట్టకపోవడం వీళ్లలో కనిపిస్తున్నట్లు తేలింది. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే నిద్రలేమికి దారితీస్తుంది. వారంలో కనీసం మూడు రాత్రుల చొప్పున.. ఇలా మూడు నెలల పాటు నిద్ర పట్టక ఇబ్బంది పడటం.. నిద్రపోయినా కూడా త్వరగా లేవడం, మధ్యాహ్నం సమయంలో కునికిపాట్లు పడటం, అలసటగా ఉండటాన్ని నిద్రలేమిగా నిర్ధరిస్తారు.

Also Read: ఈ ఆహారాలు వేడి చేసి తింటున్నారా..? అయితే జాగ్రత్త

Advertisment
తాజా కథనాలు