ఉదయం పెందలాడే నిద్రలేవడం అలాగే రాత్రికి కూడా పెందలాడే పడుకోవడం చాలా మంచిదని డాక్టర్లు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ఉదయం 8 గంటలకు తొలి అల్పాహారంతో ప్రారంభించి రాత్రి 8 గంటలకు చివరి భోజనంతో తిండే తినడం ముగిస్తే.. గుండె, రక్తనాళాలకు ఎంతో మేలు చేస్తు్న్నట్లు ఫ్రాన్స్‌కి చెందిన ఓ అధ్యయనంలో బయటపడింది. ఒకరోజులో మొదటి భోజనం ఆలస్యమవుతున్న కొద్దీ.. ప్రతి గంటకూ 6 శాతం చొప్పున గుండెజబ్బు ముప్పు పెరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
Also Read: పద్మ విభూషణ్ పురస్కార గ్రహీతలకు సిఎం జగన్ అభినందనలు
ఇక రాత్రి 8 గంటలకు ముందే ఆ రోజులో చేసే చివరి భోజనంతో పోలిస్తే.. రాత్రి 9 గంటల తర్వాత ఆహారం తీసుకునేవారికి గుండెజబ్బు ముప్పు 28 శాతం ఉన్నట్లు తేలింది. అందుకే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి అందరి సమయాలు ఒకేలా ఉండవు. ఒక్కోలా ఉన్నప్పటికీ కూడా వేళకు తినడం, భోజనానికీ భోజనానికీ మధ్య విరామం ఉండేలా చూడటం, అలాగే పడుకునే ముందు మరీ ఎక్కువగా తినకుండ తక్కువగా తినడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
ప్రపంచంలో ప్రతి లక్షకు సగటున 235 మంది గుండెరక్తనాళ జబ్బుతో మరణిస్తున్నారు. ఇక ఇండియాలో సగటున 272 మంది చనిపోతున్నారని 2020 నాటి గ్లోబల్ బర్డెన్ డిసీజ్ అనే అధ్యయనం తెలిపింది. వాస్తవానికి రోజులో మొదటి అల్పాహారం, చివరి భోజనం పెందలడే పూర్తి చేస్తే.. రాత్రి పూట తగినంత ఉపవాసం ఉన్నట్లు అవుతుంది. అందుకే సమయం ప్రకారం ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని వివిధ అవయవాల జీవగడియలు సమ్మిళితమవుతాయి. దీనివల్ల గుండెజబ్బుల ముప్పు తగ్గుతుంది.
Also Read: పదే పదే దగ్గు వేధిస్తుందా..అయితే ఇంటి చిట్కాలతో దానిని తరిమికొడదాం!