TBJP: తెలంగాణలో పార్టీ పరిస్థితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్

తెలంగాణలో కమలం పార్టీ పరిస్దితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్ అందింనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పార్టీ పనితీరు ఎలా ఉంది.. విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై పార్టీ దూతలు నివేదిక అందించినట్లు సమాచారం.

TBJP: తెలంగాణలో పార్టీ పరిస్థితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్
New Update

Telangana BJP Secret report to High Command: తెలంగాణలో కమలం పార్టీ పరిస్దితిపై బీజేపీ అధిష్టానానికి సీక్రెట్ రిపోర్ట్ అందింనట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని 119 నియోజక వర్గాల్లో పార్టీ పనితీరు ఎలా ఉంది.. విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై పార్టీ దూతలు నివేదిక అందించినట్లు సమాచారం. ఇటీవల ఇతర రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక నేతలు, కార్యకర్తల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటేననే విషయం ప్రజల్లోకి బాగా వెళ్లిందని నాయకులు తెలిపారు. అలాగే బండి సంజయ్ (Bandi Sanjay) మార్పు కూడా సరైన నిర్ణయం కాదని తేల్చి చెప్పారు. ఈ సీక్రెట్ రిపోర్టు అధిష్టానానికి అందడంతో.. రాష్ట్ర నాయకుల్లో టెన్షన్ మొదలైంది. అధిష్టానం ఎలా స్పందించబోతుందోనని అంతర్గతంగా చర్చింకుంటున్నారు.

గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా..

తెలంగాణ ఎన్నికలను బీజేపీ పెద్దలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దక్షిణాదిలో పాగ వేయాలని భావిస్తున్న కమలనాథులకు.. అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక కూడా ఇటీవల చేజారిపోయింది. దీంతో తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇక్కడ ఎలాగైనా అధికారం చేజిక్కించుకుని మళ్లీ దక్షిణాది రాష్ట్రాల్లో తన ప్రాతినిథ్యం చూపించాలని ఉవ్విళ్లూరుతోంది. ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ గెలుపును అమిత్ షా (Amit Shah) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆయన వరుస పర్యటనలు చేస్తూ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పార్టీలో చేరికల విషయంలోనూ ఆయనే ముందుండి నడింపించనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ వేదికగా తెలంగాణ బీజేపీ వార్ రూమ్ (BJP war Room) ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసి.. ఎప్పుడు ఏ అంశంపై స్పందించాలి.. ఎవరు ప్రెస్ మీట్ పెట్టాలనే అంశంపై కూడా దిశానిర్దేశం చేయనున్నారు.

ఢిల్లీ వార్ రూమ్ నుంచి దిశా నిర్దేశం..

అందుకే కీలక నేతలందరినీ అసెంబ్లీ బరిలో దించుతున్నారు. గతంలో ఎంపీగా పోటీ చేసి గెలిచిన కిషన్ రెడ్డి (Kishan reddy), బండి సంజయ్ (Bandi Sanjay), ధర్మపురి అరవింద్ (Dharmapuri Aravind), సోయం బాపూరావు వంటి నేతలు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్ 75 టార్గెట్‌ను బీజేపీ పెట్టుకుంది. గెలిచే అవకాశమున్న స్థానాలను గుర్తించడంతో పాటు 50 మంది కీలక నేతలను గుర్తించి ఎన్నికలకు సిద్ధమయ్యేలా ఇప్పటికే ఆదేశించింది. బలమైన బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌ను ధీటుగా ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేకమైన టీమ్ పని చేస్తోంది.

Also Read: అన్నపై తమ్ముడి పోటీ! రణరంగానికి సిద్ధమౌతున్న కాషాయసేన

#pm-modi #bandi-sanjay #amit-shah #telangana-bjp #g-kishan-reddy #dharmapuri-aravind #telangana-bjp-secret-report-to-high-command #tbjp #bjp-war-room
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe