Telangana: నాన్‌వెజ్ తెచ్చాడని విద్యార్థిని బహిష్కరించిన స్కూల్ ప్రిన్సిపాల్

ఉత్తరప్రదేశ్‌లో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాసులోకి నాన్‌ వెజ్‌ తీసుకొచ్చాడన్న కారణంతో స్కూల్‌ ప్రిన్సిపాల్ అతడిని బహిష్కరించాడు. సెప్టెంబర్ 5న టీచర్స్‌ డే రోజునే ఈ ఘటన జరిగింది. దీంతో ఈ వ్యవహారంపై అధికారులు విచారణకు ఆదేశించారు.

New Update
Telangana: నాన్‌వెజ్ తెచ్చాడని విద్యార్థిని బహిష్కరించిన స్కూల్ ప్రిన్సిపాల్

పాఠశాల అంటే విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే చోటు. అక్కడ ఎలాంటి బేధాభావాలు లేకుండా, వివక్ష చూపించకుండా అందరూ సమానులే అని విద్యార్థులకు బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే. కానీ పాఠశాలలోనే విద్యార్థుల మధ్య హిందూ-ముస్లిం భావనను సృష్టించడం దారుణం. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఓ విద్యార్థి క్లాసులోకి నాన్‌ వెజ్‌ తీసుకొచ్చాడన్న కారణంతో స్కూల్‌ ప్రిన్సిపాల్ అతడిని బహిష్కరించాడు. సెప్టెంబర్ 5న టీచర్స్‌ డే రోజునే ఈ ఘటన జరిగింది. స్కూల్‌ ప్రిన్సిపాల్, విద్యార్థి తల్లి మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వ్యవహారం అధికారుల దృష్టికి వెళ్లడంతో దీనిపై విచారణకు ఆదేశించారు.

Also Read: వరదల ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం

ఆ వీడియోలో గమనిస్తే.. హిల్‌టాన్ కాన్వెంట్‌ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ తన గదిలో ఆ విద్యార్థి తల్లితో వాగ్వాదానికి దిగాడు. మీ అబ్బాయి నిత్యం నాన్‌ వెజ్‌ ఆహారాన్ని క్లాస్‌లోకి తీసుకొస్తున్నాడని చెప్పాడు. మిగతా విద్యార్థులందరిని కూడా నాన్‌ వెజ్‌ తినేలా చేయించి అందరిని ఇస్లాం మతంలోకి మార్చాలని చూస్తున్నాడని ఆరోపించారు. అంతేకాదు ఆ విద్యార్థి హిందూ ఆలయాలని కూల్చాలని అనుకుంటున్నాడని అన్నాడు. మీ అబ్బాయికి ఇలాంటివే నేర్పిస్తున్నారా అని మండిపడ్డారు.

మరోవైపు ప్రిన్సిపాల్ చేసిన వ్యాఖ్యలను ఆ విద్యార్థి తల్లి ఖండించారు. గత మూడు నెలల నుంచి తన కొడుకు క్లాస్‌లోని విద్యార్థులు హిందూ-ముస్లిం విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆ రోజు తరగతి గదిలో ఉదయం నుంచి కూడా తన అబ్బాయిని కూర్చోనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చివరికి ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌.. మీ అబ్బాయికి ఇకనుంచి ఇక్కడ పాఠాలు చెప్పమని.. స్కూల్ నుంచి తొలగిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూల్‌ ప్రిన్సిపాల్‌పై నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాన్‌ వెజ్‌ తెచ్చుకున్నంత మాత్రనా విద్యార్థిని మతపరంగా భేదం చూపించడం ఏంటని తిట్టిపోస్తున్నారు.

Also Read: కర్ణాటకలో కరోనా స్కామ్.. రూ.1000 కోట్లు స్వాహా !

Advertisment
తాజా కథనాలు