రోహిత్ శర్మ తిరుగులేని కెప్టెన్‌గా నిలుస్తున్నాడు. వరుస విజయాలతో టీమ్ ఇండియాను ముందుకు నడిపిస్తూ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అనిపించుకుంటున్నాడు. దాంతో పాటూ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకుంటున్నాడు హిట్‌మ్యాన్. 36 ఏళ్ళ వయసులో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ మీద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు రోహిత్ శర్మ. ఈ మ్యాచ్ లో అతను విన్నింగ్ నాక్ ఆడాడు. 101 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 87 రన్స్ చేశాడు. ప్రపంచకప్ చరిత్రలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్ గా రికార్డ్ సొంతం చేసుకున్నాడు. రోహిత్‌కు ఇది రెండో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.
Also read:విజయనగరం రైలు ప్రమాదం-ఈరోజు కూడా పలు రైళ్ళు రద్దు
కెప్టెన్ గానే కాదు బ్యాటింగ్‌లోనూ రోహిత్ శర్మ రికార్డ్ సాధించాడు. ఏకంగా 52 ఏళ్ళ రికార్డును బద్దలుకొట్టాడు. వన్డే క్రికెట్లో ఒకే ఏడాదిలో 100 ఫోర్లు, 50 సిక్సర్లు బాదిన మొదటి ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. ఇప్పటివరకూ ఏ దేశ క్రికెటరూ ఈ ఫీట్‌నూ సాధించలేదు. ఇంక రోహిత్ తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ వన్డే వరల్డ్‌కప్ రికార్డును బ్రేక్ చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు.
Also Read:హమాస్ చెర నుంచి తమ దేశ సైనికురాలిని విడిపించుకున్న ఇజ్రాయెల్