Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి ఎక్కువగా విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా..

అయోధ్య రాములవారికి గుజరాత్‌కు చెందిన దిలీప్‌ కుమార్ వి లాఖీ అనే వజ్రాల వ్యాపారి రాముడి కోసం ఏకంగా 101 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. అంటే ఏకంగా రూ.68 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ బంగారాన్ని గుడి తలుపులు, గర్భగుడి, త్రిశూలం, పిల్లర్లకు కేటాయించినట్లు తెలుస్తోంది.

New Update
Ayodhya Ram Mandir: అయోధ్య రామాలయానికి ఎక్కువగా విరాళం ఇచ్చింది ఎవరో తెలుసా..

ఎంతోమంది రామ భక్తులు ఎన్నో ఏళ్లుగా నిరీక్షించిన రామమందిరం కల ఈరోజు సాకారమైంది. ఎట్టకేలకు అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను జరుపుకుంటున్నారు. అయితే ఈ రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది తమకు తోచినంత విరాళాలు అందించారు. రోజూ కూలి పని చేసుకునే వారి నుంచి బడా బిజినెస్‌మ్యాన్‌ల వరకు అందరూ ఇందులో భాగం పంచుకున్నారు.

రూ.68 కోట్ల విరాళం

అయితే అత్యధికంగా రాములవారికి గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబం భారీగా విరాళం అందించింది. సూరత్‌కు చెందిన దిలీప్‌ కుమార్ వి లాఖీ అనే వజ్రాల వ్యాపారి రాముడి కోసం ఏకంగా 101 కేజీల బంగారాన్ని విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ బంగారాన్ని రాముని గుడి తలుపులు, గర్భగుడి, త్రిశూలం, డమరు, పిల్లర్లకు కేటాయించినట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం దాదాపు రూ.68 కోట్లు ఉంది. 101 కేజీల బంగారం అంటే దిలీప్‌ కుమార్ కుంటుంబం రూ.68 కోట్ల విరాళం ఇచ్చారు.

Also Read: రాహుల్ గాంధీకి చేదు అనుభవం.. గుడిలోకి అనుమతించని ఆయల కమిటీ

16 ఎకరాలు అమ్మేశాడు

మరోవైపు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరాయ్‌ బాపు కూడా ఈ ఆలయ నిర్మాణం కోసం రూ.11.3 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇక బ్రిటన్, కెనడా, అమెరికాలో కూడా జీవనం సాగిస్తున్న భక్తులు రూ.8 కోట్లు విరాళం అందించారు. ఉత్తరప్రదేశ్‌లో అయితే ఓ వ్యక్తి రామమందిరం కోసం కోటీ రూపాయలు ఇవ్వాలనుకొని నిర్ణయించుకుని ఏకంగా 16 ఎకరాలు అమ్మేసినట్లు సమాచారం.

ఇందుకు రూ.15 లక్షలు తక్కువ అయితే కూడా వాటి కోసం అప్పు తెచ్చి మరి అనుకున్నట్లుగా కోటీ రూపాయలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. దేశంలో 20 లక్షల మంది కార్యకర్తలు విరాళాల సేకరించారు. దాదాపు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్లు విరాళంగా వచ్చాయి.

Also Read: ‘రాముడిని క్షమించమని వేడుకుంటున్నా’.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

Advertisment
తాజా కథనాలు