Saudi Arabia: ఒకప్పుడు 610 కేజీలు.. ఇప్పుడు 60 కేజీలకు తగ్గాడు

సౌదీ అరేబియాలో ఖలీద్‌ బిన్‌ అనే వ్యక్తి ఒకప్పుడు 610 కేజీలు ఉండేవాడు. అతడి గురించి తెలుసుకున్న ఆ దేశ రాజు.. సొంతంగా వైద్య ఖర్చులు పెట్టుకొని చికిత్స చేయించాడు. ఇప్పుడు ఖలీద్‌ ఏకంగా 60 కేజీలకు తగ్గిపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

New Update
Saudi Arabia: ఒకప్పుడు 610 కేజీలు.. ఇప్పుడు 60 కేజీలకు తగ్గాడు

ఒకప్పుడు 610 కేజీలు ఉన్న వ్యక్తి.. ఇప్పుడు 60 కేజీలకు తగ్గిపోయాడు. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంత భారీ దేహంతో.. అన్ని కిలోలు ఎలా తగ్గిపోయాడబ్బ అని ఆలోచిస్తున్నారా ?. అయితే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. సౌదీ అరేబియాకు చెందిన ఖలీద్ బిన్ మొహసేన్ వ్యక్తి భారీకాయంతో అనేక ఇబ్బందులు పడుతుండేవాడు. 2013లో అతడు ఏకంగా 610 కేజీల వరకు పెరిగాడు. దీంతో మూడేళ్ల పాటు మంచానికే పరిమితం కావాల్సి వచింది. కనీసం తన పనులు కూడా తాను చేసుకోలేకపోయాడు.

Also Read: సుంకిశాల ప్రమాదం.. మేఘా కంపెనీకి షాకిచ్చిన ప్రభుత్వం

చివరికి ఖలీద్‌ బిన్‌ గురించి సౌదీ రాజు అబ్దుల్లాకు తెలిసింది. దీంతో ఆ రాజు ఎలాగైనా అతడి ప్రాణాలు కాపాడాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తన సొంత డబ్బులతో ఖలీద్ వైద్య సేవలు అందిచడం ప్రారంభించారు. రియాద్‌లోని కింగ్ ఫాహద్ మెడికల్ సిటీకి తీసుకెళ్లారు. 30 మంది వైద్యులు ఎప్పటికప్పుడు ఖలీద్‌కు చికిత్స అందించేవారు. అతడి కోసం ఒక డైట్ ఛార్ట్‌ను కూడా సిద్ధం చేశారు. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు. వ్యాయామాలు కూడా చేయించేవారు. ఫిజియోథెరపీ చేసేవారు.

దీంతో ఖలీద్ క్రమంగా బరువు తగ్గుతూ వచ్చాడు. ఇక 2023లో ఏకంగా 542 కేజీలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 610 కేజీలున్న వ్యక్తి 60 కేజీలకు తగ్గి ఆరోగ్యవంతుడిగా మారిపోయాడు. అదనపు చర్మం తొలగింపు కోసం శస్త్ర చికిత్సలు అవసరమయ్యాయి. అధిక బరువు తగ్గి కొత్త రూపం సంతరించుకున్న అతడిని ఇప్పుడు స్మైలింగ్ మ్యాన్ అని పిలుస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు