AP: వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్ పెట్టాడు.. చివరికీ

ఏపీలో ఏలూరు జిల్లాలోని నూజివీడు మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి.. వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల వరకు బెట్టింగ్ వేశాడు. చివరికి పార్టీ ఓడిపోవడంతో డబ్బులు కట్టలేక మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
AP: వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్ పెట్టాడు.. చివరికీ

Man Died Due to Election Betting: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల బెట్టింగ్‌కు పాల్పడి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వైసీపీ గెలుస్తుందని ఏకంగా రూ.30 కోట్ల వరకు బెట్టింగ్ పెట్టి.. చివరికి వాటిని చెల్లించే స్థోమత లేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఏలూరు జిల్లాలోని నూజివీడు (Nuzivid) మండలం తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్‌రెడ్డి (52) ఏడో వార్డు సభ్యునిగా ఉన్నాడు. ఆయన భార్య సర్పంచ్‌. దంపతులిద్దరూ కూడా వైసీపీ మద్దతుదారులే.

Also Read: ప్రధాని మోదీ నివాసంలో నేడు కేబినేట్ మీటింగ్..

అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని వేణుగోపాల్‌ రెడ్డి (Venu Gopal).. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్లతో ఏకంగా రూ.30 కోట్ల వరకు బెట్టింగ్ వేశాడు. ఓట్ల లెక్కింపు రోజున ఊరు విడిచి వెళ్లాడు. ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడంతో.. మళ్లీ ఇంటికి రాలేదు. బెట్టింగ్ కట్టినవారు అతనికి ఫోన్ చేసినా కూడా ఎలాంటి స్పందన రాలేదు. జూన్‌ 7 పందెం కాసినవారు వేణుగోపాల్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఎవరూ లేకపోవడంతో తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లిపోయారు. అయితే మరుసటి రోజు వేణుగోపాల్‌ ఊళ్లోకి వచ్చాడు. ఇలా జరిగిన విషయం తెలుసుకొని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చివరికి ఆదివారం పొలం వద్ద పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహం వద్ద ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపుడి నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమంటూ పేర్కొన్నట్లు తెలుస్తోంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్నారు.

Also Read: మోదీ మంత్రివర్గంలో అత్యంత పిన్న వయస్కులు వీళ్లే.

Advertisment
తాజా కథనాలు