సాధారణంగా మనుషులు కనిపించకపోతే.. సంబంధిత వ్యక్తులు వారి ఆచూకీ చెప్తే నగదు బహుమతి ఇస్తామంటూ పోస్టర్లు వేస్తారు. అయితే ఇక్కడ మాత్రం వారు ఎంతో గారాబంగా పెంచుకున్న చిలుక ఎక్కడికో ఎగిరిపోయిందట. దీంతో హర్ట్ అయిన యజమానులు ‘మా చిలుక ఆచూకీ చెప్తే.. పది వేల రూపాయలు నగదు ఇస్తామంటూ’ పలు పోస్టర్లలో ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పూర్తిగా చదవండి..చిలుక ఆచూకీ చెప్తే రూ.10 వేలు.. నెట్టింట పోస్టర్లు వైరల్
మధ్యప్రదేశ్ కు చెందిన దీపక్ అనే వ్యక్తి.. ఎంతో కాలం నుంచి ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. అయితే అది ఇటీవల ఎక్కడికో ఎగిరిపోయింది. దీంతో దీపక్ పెంపుడు చిలక ఆచూకీ చెప్తే.. రూ.10 వేలు నగదు ఇస్తామంటూ పోస్టర్లు వేయించాడు. చిలుక తప్పిపోయిన సమయంలో సరిగ్గా ఎగరలేని స్థితిలో ఉందని, వీధి కుక్కలు ఏమైనా దాడి చేశాయోమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. చిలక గత రెండేళ్లుగా తమతో ఉంటుందని, అందుకే అదంటే తమ కుటుంబానికి ఎంతో ఇష్టమని..
Translate this News: