Crime : భార్య వివాహేతర సంబంధం.. అక్కడ కరెంట్ షాక్ ఇచ్చి చంపిన భర్త మరోక వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కోపంతో హమీద్ అనే వ్యక్తి తన భార్య ఖాతూన్ ను దారుణంగా హతమార్చాడు. అర్ధరాత్రి ఆమె నిద్రలో ఉండగా నోట్లో కరెంట్ షాక్ పెట్టి చంపేశాడు. ఈ ఘటన ఉత్తరాఖండ్ హరిద్వార్ లో జరిగింది. నిందుతుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 11 Feb 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Uttarakhand : భార్య(Wife) తనను మోసం చేసిందనే కోపంతో ఓ వ్యక్తి దారుణంగా హత మార్చాడు. జీవితాంతం తోడుంటానని మూడు ముళ్లు వేసిన చేతులతోనే అతి కిరాతకంగా చంపేశాడు. తాను ఉండగానే పరాయి పురుషుడితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో అర్ధరాత్రి కరెంట్ షాక్(Current Shock) ఇచ్చి ఆ ఇల్లాలి ఉసురు తీశాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరాఖండ్(Uttarakhand) లోని హరిద్వార్ జిల్లాలో జరిగింది. ఆమె నిద్రలో ఉన్నప్పుడు.. ఈ మేరకు పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన హమీద్(Hameed) (60) తన కుటుంబంతో కలిసి మంగ్‌లౌర్ పోలీస్‌స్టేషను పరిధిలో కొంతకాలంగా నివాసం ఉంటున్నాడు. అయితే అతనికి భార్య ఖాతూన్(Khatoon) (52), ఒక కూతురు, కుమారుడు మహ్మద్ నదీం ఉన్నారు. కొంతకాలంగా సాపీగా సాగిన వారి కుటుంబంలో అనుకోని సంఘటనలు కలహాలకు దారితీశాయి. భార్య ఖాతూన్ మరోక పురుషుడితో అక్రమ సంబంధం(Illegal Affair) పెట్టుకున్నట్లు హమీద్ అనుమానించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోన భార్యతో రోజు గొడవ పెట్టకునేవాడు. అనుమానం కాస్త రోజు రోజుకు మరింత పెరగడంతో.. ఆమెను హత మార్చాలనుకున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న హమీద్.. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు ఆమె నిద్రలో ఉన్నప్పుడు దారుణానికి పాల్పడ్డాడు. భార్య ఖాతూన్ నోట్లో కరెంట్ షాక్ పెట్టగా విద్యుదాఘాతానికి గురైన ఖాతున్.. అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇది కూడా చదవండి : Suryapet: హాస్టల్ లో ఇంటర్ విద్యార్థిని మృతి.. వాళ్లే హత్య చేశారంటున్న పేరెంట్స్ ఇక ఈ ఇష్యూపై వారి కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు హమీద్ హత్య చేసి పారిపోగా.. లంఢౌరా ప్రాంతంలో అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ ప్రమేంద్ర ఢోబాల్ వెల్లడించారు. #uttarakhand #electric-shock #illegal-affair #husband-killed-wife మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి