USA : యూఎస్ లో హిందూ ఆలయం మీద ఖలిస్తానీల దాడి విదేశాల్లో ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయం మీద దాడి చేయడమే కాకుండా.. గుడి గోడల మీద ఖలిస్తానీ అనుకూల నినాదాలు కూడా రాసేసారుజ దాంతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాసారు. By Manogna alamuru 23 Dec 2023 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Swaminarayan Temple : అమెరికా(America) లో ఖలిస్తానీ మద్దతుదారులు మారోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియా(California) లోని నెవార్క్ లో ఉన్న స్వామినారాయణ టెంపుల్ మీద దాడి చేశారు. ఆలయ గోడలపై ఖలిస్థాన్‌కి మద్దతుగా రాతలు రాశారు. గ్రాఫిటీతో భారత్‌కి వ్యతిరేకంగా స్లోగన్స్ రాశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటికే పలు దేశాల్లో ఇలా భారత్‌కి వ్యతిరేకంగా హిందూ ఆలయాలపై దాడులు జరిగాయి. ముఖ్యంగా యూకే, ఆస్ట్రేలియాలో ఇలాంటివి వెలుగు చూశాయి. A Hindu temple has been vandalised with anti-India and pro-Khalistan graffiti on its exterior walls in Newark, California, United States. Newark Police has assured a thorough investigation into the incident. pic.twitter.com/ruhEY6nkv1 — ANI (@ANI) December 23, 2023 పోలీసులతో పాటు పౌరహక్కుల సంఘాలూ ఈ దాడిపై విచారణ జరుపుతున్నాయి. విద్వేషాలు వ్యాప్తి చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ దాడిని ఖండించింది. భారతీయుల మనోభావాల్ని ఇలాంటి ఘటనలు దారుణంగా దెబ్బ తీస్తాయని అసహనం వ్యక్తం చేసింది. దాడి చేసిన వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఒత్తిడి తీసుకొచ్చాం. అమెరికా అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పారు. We strongly condemn the defacing of SMVS Shri Swaminarayan Mandir at Newark, California with anti-India graffiti. This incident has hurt the sentiments of the Indian community. We have pressed for quick investigation and prompt action against the vandals by the US authorities in… — India in SF (@CGISFO) December 23, 2023 ఆస్ట్రేలియా, కెనడాల్లో కూడా ఇలాంటి దాడులు ఇంతకు ముందు జరిగాయి. దీనివల్ల భారత్ తో ఇతర దేశాలకు ఉన్న సంబంధాలు దెబ్బ తింటున్నాయని భారత రాయబార కార్యాలయం అంటోంది. ఈ ఏడాది ఆగస్టులో కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ లో ఓ హిందూ ఆలయం మీద దాడి జరిగింది. అక్కడ ఖలిస్తానీ మద్దతుదారులు పోస్టర్లను అంటించారు. #usa #america #hindu-temple #khalisthan #swaminarayan-temple మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి