Land on Moon: చంద్రమండలంపై భూములకు పెరుగుతున్న ధరలు..కొనేందుకు పోటీ పడుతున్న మనుషులు. ఈ వార్తా చూసి షాక్ అవుతున్న మరొకొందరు. అసలు ఇదెలా సాధ్యం..? అలా ఎలా కొంటారు..? ఎకరం రేట్ ఎంతో తెలుసా..? ఆ విషాయాలు ఇప్పుడు చూద్దాం.
చందమామ రావే..జాబిల్లి రావే అని గోరుముద్దలు తినిపించిన అమ్మకి గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపోయేలా చేసింది ఓ కూతురు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాంచందర్, వకుళాదేవిల పెద్ద కూతురైన సాయి విజ్ఞత తల్లికి మదర్స్ డే గిఫ్ట్‌గా చంద్రుడిపైనే స్థలం కొని..రిజిస్ట్రేషన్ చేయించి..ఆ స్థలాన్ని తల్లికి గిఫ్ట్‌గా ఇచ్చన విషయం తెలిసిందే. కూతురి కొండంత ప్రేమ చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు.
పిల్లలకు గిఫ్ట్‌గా
పూర్వం చిన్నపిల్లలు అన్నం తినకపోయినా ఏడుస్తున్న చందమామ రావే జాబిల్లి రావే అంటూ జోల పాడుతూ అన్నం తినిపించేవారు. నిద్రపుచ్చేవారు. ఉన్నత విద్య అభ్యసించి ఇతర దేశాల్లో ఉద్యోగం చేస్తున్న కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన ఒక ఇంజనీర్‌కు ఈ చందమామ రావే జాబిల్లి రావే అన్న సూక్తి ఎప్పుడు గుర్తుకు వచ్చేది. ఆ సూక్తిని ఎప్పుడూ గుర్తుకు తెచ్చుకునే ఈ యువ ఇంజనీర్‌కు చంద్రుడిపై జాగ కొంటే అలా ఉంటుందని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన వచ్చిన వెంటనే తన తోటి మిత్రులతో సంప్రదిస్తే హేళన చేశారు. కానీ ఆ యువ ఇంజనీర్ తన మాత్రం వేడలేదు. అనుకున్నదే తడవుగా తన కుమార్తెలైన మానస, కార్తికల పేరిట చెరో ఎకరం భూమిని లూనార్ రిపబ్లిక్ సొసైటీ ద్వారా కొనుగోలు చేశారు.
ఎంతో ఆనందంగా ఉంది
చంద్రునిపై ప్రయోగాలు చంద్రమండలంపై అన్వేషణ ఇతర అంశాలను లూనార్ రిపబ్లిక్ సొసైటీ (Lunar Republic Society) పర్యవేక్షణ ఉందని తెలుసుకున్న కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామానికి చెందిన ఇంజనీర్ శ్రీజగన్ తమ కుమార్తెలకు సంవత్సరం.. రెండు సంవత్సరాలు ఉన్న వయసులో 2005వ సంవత్సరంలో ఈ భూమిని కొనుగోలు చేశారు. చిన్న వయసులో తమ కుమార్తెలకు చంద్రునిపై భూమిని కొనుగోలు చేసి గిఫ్ట్‌గా ఇచ్చానని తమ కుమార్తెలు ఇప్పుడు ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారని 18 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన భూమిలో చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతం కావటం ఎంతో ఆనందంగా ఉందని యువ ఇంజనీర్ జగన్ అంటున్నారు.
అక్కడ ఉంటారో.. లేదో..!!
చంద్రుడి మీద స్థలానికి ఒక ఎకరం ధర 3 వేల 100 రూపాయలు. మనుషులు అక్కడ ఉంటారో.. లేదో క్లారిటీ లేదు గానీ.. జనాలు మాత్రం స్థలాలు కొనేస్తున్నారు. ఇప్పటికే సెలెబ్రిటీలు షారుఖ్ ఖాన్, సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఉన్నారు. ఈ భూమిని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్స్ రిజిస్ట్రీ ద్వారా కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన రాజీవ్ బగ్డి, బెంగళూరుకు చెందిన లలిత్ మోహతా కూడా చంద్రుడిపై స్థలం కోనుగోలు చేశారు. చంద్రయాన్-3 జాబిల్లి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయిన విషయం తెలిసిందే.
Also Read: షార్‌లో విషాదం.. వాయిస్ ఆఫ్ ఇస్రో, శాస్త్రవేత్త వలర్మతి ఇక లేరు!