Online Betting : ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బలైపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబం.. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. సన్‌సిటీలో ఉంటున్న ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కొడుకును చంపి ఆ తర్వాత భార్యభర్తలు విషం తాగి మృతి చెందారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో నష్టపోవడంతో ఆర్థిక ఇబ్బందులతోనే వీళ్లు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. By B Aravind 09 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Rangareddy District : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్(Rajendra Nagar) లో విషాదం చోటుచేసుకుంది. సన్‌సిటీ(Sun City) లో ఉంటున్న ఓ కుటుంబం బలవన్మరణం చెందడం కలకలం రేపింది. కొడుకును చంపి ఆ తర్వాత భార్యభర్తలు విషం తాగి మృతి చెందారు. ఆర్థిక ఇబ్బందులతోనే(Financial Problems) వీళ్లు ఆత్మహత్య(Suicide) కు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం మేరకు ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండలం మల్కాపూర్‌కు చెందిన ఇందిరకు నాలుగేళ్ల క్రితం రామంతాపూర్‌కు చెందిన ఆనంద్‌తో వివాహం జరిగింది. మూడేళ్లుగా బండ్లగూడజాగీర్ పరిధిలోని సన్‌సిటీలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. Also read: అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి… ఇది పదకొండవది! ఇందిర ప్రైవేట్ జాబ్ చేస్తుండగా.. ఆనంద్ కొంతకాలం పాలవ్యాపారం చేసి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. అయితే ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటుపడిన ఆనంద్.. తరచూ డబ్బులు పోగొట్టుకునేవాడు. దాదాపు రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చడానికి ఇందిర బంగారంతో పాటు కారును కూడా అ మ్మేశాడు. ఫ్లాట్‌ను కూడా అమ్మేందుకు సిద్ధమవడంతో దంపతుల మధ్య గొడవ మొదలయ్యాయి. గొడవలు మరింత పెరగడంతో మల్కాపూర్ రావాలని కుటుంబ పెద్దలు సూచించారు. దీంతో మల్కాపూర్‌కు వెళ్లాలని దంపతులు నిర్ణయించుకున్నారు. కానీ వాళ్ల తోడల్లుడికి ఫోన్ చేసిన ఆనంద్.. తాము చనిపోతున్నట్టు చెప్పాడు. ఇంతలోనే భార్య, కుమారుడికి విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి.. తాను కూడా తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు.. ఆనంద్ ఎప్పుడూ కూడా భార్యను వేధించేవాడని ఇందిర కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్స్ వల్లే వారి కుటుంబంలో ఆర్థిక సమస్యలు మొదలై.. చివరికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు. మరోవైపు ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడితే నష్టపోతారని.. వాటికి దూరంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. Also read: పోలీస్ శాఖలో విషాదం.. విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత #telugu-news #telangana #suicide #online-betting-game మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి