ICC World Cup: టీమిండియా ఓటమి జీర్ణించుకోలేక అభిమాని మృతి..

ప్రపంచకప్ ఫైనల్స్‌ టీమిండియా ఓడిపోవడంతో తిరుపతిలోని ఓ క్రికెట్ అభిమాని గుండెపోటుతో చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుడు తిరుపతి రూరల్‌ మండలం దుర్గ సముద్రంకు చెందిన జ్యోతి కుమార్‌గా గుర్తించారు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

వరల్డ్‌కప్‌లో టీమిండియా ఓటమితో కోట్లాదిమంది అభిమానుల గుండెలు బరువెక్కాయి. అయితే తిరుపతిలోని ఓ క్రికెట్‌ అభిమాని.. టీమిండియా ఓటమితో జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతి చెందినట్లు తెలుస్తోంది. స్నేహితులతో కలిసి అతను మ్యాచ్ చూస్తుండగా.. ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అతను మృతి చెందాడు. మృతుడు తిరుపతి రూరల్‌ మండలం దుర్గ సముద్రంకు చెందిన జ్యోతి కుమార్‌గా గుర్తించారు. జ్యోతి కుమార్ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.

Also Read: విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 40కి పైగా బోట్లు దగ్ధం..

Advertisment
తాజా కథనాలు