Telangana : యువకుడి ప్రాణాలు తీసిన క్రికెట్ బెట్టింగ్

సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే బీటేక్ విద్యార్థి ఐపీఎల్‌ బెట్టింగ్ కోసం ఆన్‌లైన్ యాప్స్‌లో రూ.25 లక్షలు లోన్ తీసుకున్నాడు. బెట్టింగ్‌లో తీవ్రంగా నష్టపోవడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

New Update
AP: దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను భార్య ఏం చేసిందంటే?

Betting Killed : ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌ యాప్స్‌(Online Apps) లో బెట్టింగ్ పెట్టడం రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం ఐపీఎల్‌(IPL) సీజన్ ఉన్న నేపథ్యంలో ఈ బెట్టింగ్‌లు తారాస్థాయికి చేరాయి. చాలామంది బెట్టింగ్‌ల వల్ల లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మరికొందరైతే బెట్టింగ్‌ల వల్ల అప్పులు ఎక్కువై ఆత్మహత్య(Suicide) చేసుకున్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే తాజాగ క్రికెట్‌ బెట్టింగ్(Cricket Betting) ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చెందిన వినీత్ అనే విద్యార్థి బీటెక్ చదువుతున్నాడు.

Also read: మరో నల్లజాతీయుడిపై పోలీసుల కర్కశత్వం.. ఊపిరాడక బాధితుడు మృతి

ఐపీఎల్‌లో బెట్టింగ్ పెట్టేందుకు ఆన్‌లైన్ యాప్స్‌లో రూ.25 లక్షల వరకు లోన్లు(25 Lakhs Loan) తీసుకున్నాడు. బెట్టింగ్ తీవ్రంగా నష్టపోవడంతో వినీత్ మనస్తాపం చెందాడు. అతని తల్లిదండ్రులు అయోధ్య టూర్‌కి వెళ్లడంతో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్‌ నోట్ కూడా రాశాడు. విషయం తెలుసుకున్న వినీత్ తల్లిందండ్రులు హుటాహుటీనా సంగారెడ్డికి బయలుదేరారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: కాంగ్రెస్ మండలాధ్యక్షుడి దారుణ హత్య.. సముద్రంలో డెడ్ బాడీ!

Advertisment
తాజా కథనాలు