Haj-Pilgrimage: సౌదీ అరేబియాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. వారం క్రితం ఇక్కడ అత్యధికంగా 51.8 డిగ్రీలు నమోదైంది. ఈ ఎఫెక్ట్ హజ్ యాత్ర మీద విపరీతంగా పడింది. మక్కా యాత్రకు వచ్చిన వేలమంది వడదెబ్బకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 1000 మంది చనిపోయారని అంతర్జాతీయ మీడియా చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది ఈజిప్టు వాళ్ళే ఉన్నారు. అయితే ఇతర దేశస్థులు కూడా కొంత మంది చనిపోయారు. ఆయా దేశాల రాయబార కార్యాలయాల ప్రకటనల ఆధారంగా ఈ సంఖ్యను లెక్కించినట్లు సమాచారం. మెడికల్ కాంప్లెక్సు వద్ద కొంతమంది మృతుల వివరాలు ప్రకటించారు. ఈ జాబితాలో అల్జీరియా, ఈజిప్టుతోపాటు భారత్‌కు చెందినవారి పేర్లు కూడా ఉన్నాయి.
దీన్నిబట్టి హజ్ యాత్రలో చనిపోయిన వారిలో ఇప్పటివరకు 98మంది భారతీయులను గుర్తించారు. ఈ యాత్రకు మొత్తం 1.75 లక్షల మంది వెళ్ళారు. ఇందులో సహజకారణాలు, అనారోగ్యం, వృద్ధాప్యం కారణాల వల్లనే ఎక్కువ మంది చనిపోయారని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ తెలిపారు. మరోవైపు గతేడాదితో పోలిస్తే మృతుల సంఖ్య తగ్గిందని చెప్పారు. లాస్ట్ ఇయర్ ఈ సంఖ్య 187గా ఉంది.
Also Read:Andhra Pradesh: పలువురు ఐఏఎస్ లకు అదనపు బాధ్యతలు అప్పగింత.