Maharashtra : దారుణం.. కలుషిత మంచినీళ్లు తాగి 93 మందికి అస్వస్థత మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ముగావ్ టాండా అనే గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బావిలో కలుషిత మంచినీళ్లు తాగి ఏకంగా 93 మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆ బావిని సీజ్ చేశారు. By B Aravind 01 Jul 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కలుషిత మంచినీళ్లు తాగి ఏకంగా 93 మంది అస్వస్థకు గురికావడం కలకలం రేపింది. కుడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో అందరూ ఆస్పత్రిపాలయ్యారు. ఇక వివరాళ్లోకి వెళ్తే.. ముగావ్ టాంటా అనే గ్రామంలో మొత్తం 107 ఇళ్లు ఉన్నాయి. 440 మంది అక్కడ నివసిస్తున్నారు. ఆ ఊరిలో ఓ బావి ఉంది. అందులో ఉన్న నీటినే గ్రామస్థులు వాడుకుంటున్నారు. Also Read: స్వగ్రామానికి రామకృష్ణ రెడ్డి భౌతిక కాయం.. ప్రభుత్వ లాంచనాలతో మట్టి కార్యక్రమం అయితే జూన్ 26, 27 తేదీల్లో 93 మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో అక్కడ మెడికల్ క్యాంప్ చేసి చికిత్స అందించారు. 56 మంది గ్రామంలోనే రికవరీ కాగా.. మరో 37 మందిని పొరుగు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పుడు వాళ్లు కూడా కోలుకున్నారు. నీళ్లు కలుషితం కావడంతోనే గ్రామస్థులు అస్వస్థకు గురైనట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు ఆ బావిని సీజ్ చేశారు. ప్రస్తుతం పొరుగూరిలోని ఫిల్టర్ నుంచి ముగావ్ టాండాకు తాగు నీళ్లు సరఫరా చేస్తున్నారు. Also Read: CSE ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. రిజల్ట్ లింక్ ఇదే! #maharashtra #telugu-news #national-news #contaminated-water మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి