కాంగ్రెస్‌ 6 గ్యారంటీల అమలు.. ఏటా ఎన్ని కోట్లు కావాలంటే!

తెలంగాణలో నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరనుంది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపైనే రేవంత్ సీఎం హోదాలో తొలి సంతకం చేయనున్నారు. అయితే ఈ గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రతియేట దాదాపు రూ.88 వేల కోట్లకుపైగానే అవసరం అవుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాంగ్రెస్‌ 6 గ్యారంటీల అమలు.. ఏటా ఎన్ని కోట్లు కావాలంటే!
New Update

Revanth Reddy Has To Deliver 6 Guarantees : తెలంగాణలో కాంగ్రెస్ (Telangana Congress)ప్రభుత్వం నేడు కొలువుతీరనుంది. ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy)ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ (Congress Party)ప్రకటించిన ఆరు గ్యారంటీల ఫైల్ పై రేవంత్ సీఎం హోదాలో మొదటి సంతకం చేయనున్నారు. ఈ గ్యారంటీలను హామీలుగా కాకుండా చట్టలుగా అమలు చేస్తామని ఇప్పటికే రాహుల్ గాంధీ సైతం ప్రజలకు మాటిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసిన తర్వాత వీటికి ఎంత వ్యయం అవుతుందనే విషయంలో స్పష్టత రానుండగా.. ఇప్పటికే ఆర్థిక నిపుణులు సుమారు ఏటా రూ. 70 - 88 వేల కోట్లు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

1. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతి నెలా రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, ఆర్టీసీ బస్సుల్లో వారికి ఉచిత ప్రయాణం. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలేంటి, ఎంతమంది మహిళలకు ఇస్తారనేది నిర్ణయించాల్సి ఉంది. ఈ పథకానికి ఏటా సుమారు రూ.18 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారుల ప్రాథమిక అంచనా. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది గ్యాస్‌ వినియోగదారులున్నారు. అర్హతలు నిర్ణయించిన తర్వాత వారిలో రాయితీ ఎంతమందికి వర్తిస్తుందనే తేలాల్సివుంది.

2. రైతు భరోసా కింద ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు. వరిపంటకు బోనస్‌గా క్వింటాలుకు రూ.500. రైతుబంధు కింద మొదటి విడత నిధులు గత ప్రభుత్వం పంపిణీ చేసినందున.. ఇప్పుడు రెండో విడత ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం మొదట ఇచ్చిన రూ.5 వేలు కాకుండా మరో రూ.10 వేల చొప్పున ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఇది కూడా చదవండి: Telangana: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను క‌లిసిన స్వగ్రామస్తులు.. భావోద్వేగం..!

3. ‘ఇందిరమ్మ గృహ నిర్మాణం’ కింద ఇల్లు లేని కుటుంబాలకు ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయింపు.

4. ‘గృహజ్యోతి’లో భాగంగా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు

5. యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఏర్పాటు

6. చేయూత కింద వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులు, డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి నెలవారీ పింఛను రూ.4 వేలు, పేదలకు రూ.10లక్షల రాజీవ్‌ ఆరోగ్యశ్రీ ఆరోగ్య బీమా.

ఇక ఒక్కో హామీ చొప్పున చూసుకుంటే.. మహాలక్ష్మీకి రూ.10 వేల కోట్లు. గృహజ్యోతికి రూ.3,431.03 కోట్లు. రైతు భరోసాకు రూ.29వేల కోట్లు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.15వేల కోట్లు. చేయూతకు రూ.21 వేల కోట్లు. యువ వికాసానికి రూ. 10వేల కోట్ల నిధులు కావాల్సివుంటుందని అర్హుల ఆధారిత లెక్కలు చెబుతున్నాయి.

#telangana-congress #telangana-cm #revanth-reddy-has-to-deliver-6-guarantees
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe