ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస తీపి కబుర్లు అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేస్తోంది. ఈ క్రమంలోనే అన్ని విభాగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. ఇటీవలే టీటీడీలో ఉద్యోగాల కోసం ధరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఏపీలోని దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ మేరకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ చేపట్టనుండగా..మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీఇలో ఏఈఈ, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 35
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్): 05
టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్): 30 పోస్టులు
మొత్తం ఖాళీలు - 70
ఇదికూడా చవవండి : అందుకే అమ్మను షూటింగ్ లొకేషన్‌కు రానివ్వలేదు.. జాన్వీ కపూర్
అర్హతలు :
* ఆంధ్రప్రదేశ్ కు చెందిన హిందూ మతస్తులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
* టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఎల్‌సీఈ డిప్లొమా, ఏఈఈ పోస్టులకు బీఈ, బీటెక్ (సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణులై ఉండాలి.
* వయోపరిమితి 42 సంవత్సరాలకు మించకూడదు.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయిదేళ్ల సడలింపు ఉంటుంది.
* అప్లికేషన్ ఫీజు రూ.500.
* ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
* దరఖాస్తులు చేసుకునేందుకు 2024 జనవరి 05 చివరి తేది
అప్లికేషన్స్ పంపాల్సిన చిరునామా:
ది కన్వీనర్, రిక్రూట్‌మెట్ సర్వీస్, పవర్ అండ్ ఎనర్జీ డివిజన్ ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, గచ్చిబౌలి, హైదరాబాద్ (The Convener, Recruitmet Service, Power and Energy Division Engineering College of India, Gachibowli, Hyderabad)
ఎంపిక :
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
జీతం :
ఏఈఈ (AEE) : రూ.35,000, టీఏ (TA)కు రూ.25,000 వీటితోపాటు పాటు అదనపు అలవెన్సు చెల్లిస్తారు.