Andhra Pradesh : దారుణం.. సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఏడేళ్ల బాలుడు మృతి..

విశాఖపట్నంలోని ఆనందపురం మండలం బొడ్డుపాలెంలో సెప్టిక్ ట్యాంక్‌లో పడి ఏడేళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. మధురవాడ వాంబై కాలనీకి చెందిన బాలుడు బొడ్డుపాలెం వచ్చాడు. ఆడుకుంటూ ఉండగా.. అదుపుతప్పి సెప్టిక్‌ ట్యాంక్‌లో పడి మృతిచెందాడు.

New Update
Andhra Pradesh : దారుణం.. సెప్టిక్‌ట్యాంక్‌లో పడి ఏడేళ్ల బాలుడు మృతి..

Vizag : విశాఖపట్నం(Visakhapatnam) లోని ఆనందపురం మండలం బొడ్డుపాలెంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్ లోని సెప్టిక్‌ ట్యాంక్‌(Septic Tank) లో పడి 7 ఏళ్ల బాలుడు మృతి చెందడం కలకలం రేపింది. బాలుడి కుటుంబం మధురవాడ వాంబై కాలనీలో ఉంటున్నారు. సంక్రాంతి(Sankranti) పండుగకు ఆ బాలుడు బొడ్డుపాలెం వచ్చాడు. అలా ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా ఆ సెప్టింగ్‌ ట్యాంక్‌లో పడి మృతిచెందాడు. దీంతో బాలుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడి మృతదేహాన్ని భీమిలీ మార్చురీకి తరలించారు. ఆనందపురం(Anandapuram) పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: అయోధ్యలో డేగ కళ్లతో నిఘా.. పది వేల మందికి పైగా భద్రతా సిబ్బంది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు