Plane Crash : గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి

బ్రెజిల్‌లోలోని ఓ చిన్న విమానం కప్పుకూలడంతో ఏడుగురు మృతి చెందారు. గెరైస్ అనే రాష్ట్రంలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సావోపాలో అనే రాష్ట్రంలో క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేదిన కాసేపటికే విమానంలో ప్రమాదం చోటుచేసుకోగా.. గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలింది.

Plane Crash : గాల్లో ఉండగానే ముక్కలై కుప్పకూలిన విమానం.. ఏడుగురు మృతి
New Update

Brazil : బ్రెజిల్‌(Brazil) లోలోని మినాస్ గెరైస్(Minas Gerais) అనే రాష్ట్రంలో ఓ చిన్న విమానం కుప్పకూలింది(Plane Crash). ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. సావోపాలో అనే రాష్ట్రంలో క్యాంపినాస్ నగరం నుంచి బయల్దేదిన కాసేపటికే.. ఆ విమానంలో ప్రమాదం జరిగింది. దీంతో గాల్లో ఉండగానే అది ఒక్కసారిగా ముక్కలై కుప్పకూలిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే ఏడుగురు మృతి చెందారు.

Also Read: పొట్టు పొట్టు కొట్టుకున్న పార్లమెంట్ ఎంపీలు..

అయితే విమాన ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై ఇంకా స్పష్టత లేదు. సాంకేతిక లోపమా ఇంకా ఏదైనా జరిగిందా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ విమానం ఓ గుట్టపై కూలినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలతో పాటు ఈ మధ్య విమాన ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇలాంటి చిన్న విమానాలు కుప్పకూలుతున్నాయి.

Also Read: విద్యార్థిని చెప్పుతో కొట్టిన స్టార్ సింగర్.. వీడియో వైరల్

#telugu-news #brazil #plane-crash-in-brazil
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe