E-Challans Worth Rs 51.45 Lakh in Hyderabad: హైదరాబాద్‌లో పెట్టిన కొత్త రూల్స్ చలాన్ల వరద పారిస్తోంది. నగరంలోకి భారీ వాహనాల ప్రవేశాలకు నిర్ణీత సమయాలను పెట్టడంతో తెగ చలాన్లు వసూలు అవుతున్నాయి. సిటీ పోలీసులు పెట్టిన ఈ రూల్‌సు భారీ వాహనదారులు పాటించడం లేదు. దీంతో కేవలం 40 రోజుల్లో 6,120 సార్లు ఫైన్స్ వేశారు ట్రాఫిక్ పోలీసులు. దీని ద్వారా మొత్తం 51.45 లక్షల డబ్బులు కలెక్ట్ అయ్యాయి. ఫిబ్రవరి 20 నుంచి భారీ వాహనాల ప్రవేశాలు, నిష్క్రమణకు పరిమిత సమయాన్ని కేటాయిస్తూ కొత్త రూల్‌ను అమలు చేశారు.
ఫిబ్రవరి 20 నుంచి మార్చి 30 వరకు...
ఈ కొత్త రూల్ వలన ఇప్పటివరకు హైదరాబాద్ కమిషనరేట్‌లోని 31 పోలీస్ స్టేషన్ల పరిధిలో 183 ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టులు నమోదయ్యాయి. ఇవి ఫిబ్రవరి 20 నుంచి మార్చి 30 మధ్య ట్రాక్ చేయబడ్డాయని పోలీసులు చెబుతున్నారు. భారీ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోవడం లేదని పోలీసులు అంటున్నారు. అధికారులు చెబుతున్న డేటా ప్రకారం టోలీ చౌకలో అత్యధికంగా 981 ఈ -చలాన్లు నమోదయ్యాయి. దీని తరువాత మలక్‌పేట, చాంద్రాయణ గుట్టల్లో వరుసగా 620, 441 ఈ -చలాన్లు రిజిస్టర్ అయ్యాయి. ఇక ఎఫ్‌ఐఆర్‌ల విషయానికి వస్తే 30 ఫిర్యాదులతో తిరుమలగిరి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత చిక్కడపల్లి 18, లంగర్‌హౌస్ లో 17 కేసులు నమోదయ్యాయి.
దయచేసి రూల్స్‌ను పాటించండి..
ఈ ఈ-చలాన్లను (e-Challan) వెంటనే కట్టేయాలని డ్రైవర్లను కోరుతున్నారు హైదరాబాద్ సిటీ పోలీసులు. దాంతో పాటూ ఇక మీదట నగరంలోకి ప్రవేశించే ముందు, వెళ్ళే ముందు రూల్ ప్రకారం టైమ్‌ను పాటించాలని అంటున్నారు. వాహన రకాన్ని బట్టి అనుమతించబడిన సమయాల్లోనే తిరగాలని సూచిస్తున్నారు. పర్మిట్ లేకుండా తిరిగితే ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. భారీ వాహనాల ఆంక్సల మీద ట్రాన్స్‌పోర్టర్లకు ఇప్పటికీ అవగాహన లేదని చెబుతున్నారు. భారీ వాహనాల వల్ల కీలక మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోతుండడం వల్లనే ఈ కొత్త రూల్స్ పెట్టామని తెలిపారు పోలీసులు.
Also Read:Gold Price: మహిళలకు షాకింగ్ న్యూస్..హడలెత్తిస్తున్న బంగారం ధరలు..తులం 70వేలకు దగ్గరలో..