Staff Nurse: 6,956 మంది స్టాఫ్ నర్సులకు నేడు నియామక పత్రాలు..

తెలంగాణలో ఎంపికైన 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లకు బుధవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తదితరులు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్నారు.

New Update
Staff Nurse: 6,956 మంది స్టాఫ్ నర్సులకు నేడు నియామక పత్రాలు..

తెలంగాణలో స్టాఫ్‌ నర్సులుగా ఎంపకైన వారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన 6,956 మంది నర్సింగ్ ఆఫీసర్లకు బుధవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం వేదికగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. 2022 డిసెంబర్‌లో.. 7,094 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదలైంది. తాజాగా ఈ ఎంపిక జాబితాను రాష్ట్ర సర్కార్ ప్రకటించింది.

Also Read: అధికారికంగా ప్ర‌జా గాయ‌కుడు గ‌ద్ద‌ర్ జ‌యంతి వేడుక‌లు

ప్రభుత్వానికి రూ.35 కోట్ల భారం

మొత్తం 9 విభాగాల్లో 6,956 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. అయితే ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్‌ క్యాటగిరీలో అభ్యర్థులు లేకపోవడంతో 138 పోస్టులు భర్తీ కాలేదని అధికారులు చెప్పారు. నర్సింగ్ ఆఫీసర్లకు కనీస వేతన.. రూ.36,750తో పాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. వీళ్ల వేతనాలతో ప్రభుత్వంపై ప్రతి ఏడాది రూ.35 కోట్లు భారం పడుతుందని అధికారులు తెలిపారు. అయితే ఎంపికైన నర్సింగ్ ఆఫీసర్లలో దాదాపు 12 శాతం పురుషులు ఉన్నట్లు పేర్కొ్న్నారు.

మమ్మల్ని ఎందుకు పిలవలేదు 

అయితే నర్సింగ్‌ ఆఫీసర్ల నియామకానికి సంబంధించి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదంటూ నర్సింగ్‌ యూనియన్లు విమర్శలు చేస్తున్నారు. తమ వినతులు, ఒత్తిడి ఫలితంగానే గత ప్రభుత్వం స్టాఫ్‌నర్సుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు చెబుతున్నాయి. నర్సింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్న కూడా తమకు ఎలాంటి ఆహ్వానం అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: రికార్డుల్లో ఎన్టీఆర్‌ స్మారక నాణెం.. ఎందుకో తెలుసా?

Advertisment
తాజా కథనాలు