Corona cases:ఒక్కరోజులోనే 602 కొత్త కరోనా కేసులు నమోదు

దేశంలో కరోనా రోజురోజుకూ పెరుగుతోంది. నిన్కొన ఒక్క రోజులోనే కొత్తగా 602 కేసులు నమోదయ్యాయి. జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తితో ఐదుగురు చనిపోయారు.

Covid Alert:కరోనా బీభత్సం...ఒక్క నెలలోనే 10వేల మరణాలు
New Update

New covid cases:భారతదేవంలో మరోసారి కరోనా వేవ్ రానుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ఒక్కరోజు 602 కేసులు నమోదయ్యాయి. ఐదుగురు పాజిటివ్ వ్యక్తులు చనిపోయారు. నిన్నటితో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4440కు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. మొత్తం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ జేఎన్ 1 వేరియంట్‌ వ్యాప్తిని ఇప్పటివరకు గుర్తించినట్టు ఇన్సాకాగ్ స్పష్టం చేసింది.

Also Read:సీరీస్ ఎలాగో రాదు కనీసం సమం అయినా చేస్తారా?

అత్యధికంగా కేరళలో 147 జేఎన్ 1 కొవిడ్ వేరియంట్ కేసులు వెలుగు చూడగా.. గోవాలో 51, గుజరాత్‌లో 34, మహారాష్ట్రలో 26, తమిళనాడులో 22, ఢిల్లీలో 16 కేసులు నమోదయ్యాయి. ఇక తెలంగాణలో కూడా నిన్న ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌ జిల్లాలో నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో నలుగురికి పాజిటివ్‌గా తేలింది. రేకుర్తికి చెందిన ఓ మహిళకు, 18 నెలల బాలుడికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇక, మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో రెండు పాజిటివ్‌ కేసులను గుర్తించారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్‌ జేఎన్‌-1 పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

#covid #new-cases #carona-jn1-variant #corona #india
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe