AP : ఏపీలోని పల్నాడు(Palnadu) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. బాపట్ల జిల్లా చిన గంజాం నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు(Private Travels Bus) మంగళవారం రాత్రి హైదరాబాద్(Hyderabad) కు బయల్దేరింది. అరవింద ట్రావెల్స్ కు చెందిన బస్సు పర్చూరు, చిలకలూరి పేట మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంది. బస్సు బయల్దేరిన సమయంలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
వారిలో చినగంజాం, గొనసపూడి, నీలాయపాలెంకు చెందినవారు ఎక్కువమంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరంతా కూడా సొంత ఊరిలో ఓటు వేసి.. తిరిగి హైదరాబాద్‌కు వెళుతున్న వారే. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం అన్నంబొట్లవారిపాలెం - పసుమర్రు గ్రామాల మధ్య ఈవూరివారిపాలెం రోడ్డు దగ్గర.. మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బస్సును ఎదురుగా వేగంగా కంకరతో వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది.
దీంతో వెంటనే క్షణాల్లో టిప్పర్‌కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో మొత్తం ఆరుగురు సజీవ దహనం కాగా... మరో 20 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బస్సులో నుంచి క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతంలో భీకర వాతావరణం నెలకొంది. వెంటనే స్థానికులు ఈ ప్రమాదంపై 108, పోలీసులకు స చారం అందించారు. వెంటనే వారంత అక్కడికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. ఆ వెంటనే చీరాల, యద్దనపూడి, చిలకలూరిపేట, యడ్లపాడు నుంచి 108 వాహనాలను ప్రమాదం జరిగిన ప్రాంతానికి వచ్చాయి.
బస్సులో చిక్కుకుపోయి తీవ్ర గాయాల పాలు అయిన వారిని బయటకు తీశారు.. వారిని 108 వాహనాల్లో 20 మంది వరకు గాయపడినవారిని చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. బైపాస్ పనులు జరుగుతుండటంతో.. తారు రోడ్డుపై మట్టి భారీగా పేరుకుపోయి ఉందని స్థానికులు చెబుతున్నారు. టిప్పర్ అతి వేగంతో దూసుకురావడంతో టిప్పర్ డ్రైవర్ కంట్రోల్ చేయలేక బస్సును ఢీకొట్టినట్లు చెబుతున్నారు.
Also read: భోజనానికి ముందు కానీ, తరువాత కానీ…టీ , కాఫీలు తాగుతున్నారా..అయితే తస్మాత్ జాగ్రత్త!