IT Jobs: ఐటీ ఉద్యోగులకు షాక్.. 52 వేల ఉద్యోగాలు ఔట్

దేశీయ ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరు నెలల్లో దాదాపు 52 వేల ఐటీ ఉద్యోగాలు పోయాయంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ మందగమనం లాంటివి దేశీయ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపిస్తున్నాయి. మరోవైపు ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవారికి ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తోందని నిపుణులు చెబుతున్నారు.

New Update
IT Jobs: ఐటీ ఉద్యోగులకు షాక్.. 52 వేల ఉద్యోగాలు ఔట్

దేశంలోని ఐటీ రంగంలో సంక్షోభ ఛాయలు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో నెలకొన్న విపత్కర పరిస్థితులు, గ్లోబల్ ఎకనామీలో అనిశ్చిత వాతావరణం వల్ల దేశీయ ఐటీ కంపెనీల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టే దిశగా ఆయా కంపెనీలు వెళ్తున్నాయి. 2023-2024 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు 52 వేల ఉద్యోగాలు పోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత 25 ఏళ్లలో చూసుకుంటే ఇంత గరిష్ఠ స్థాయిలో ఉద్యోగాలు ఊడిపోవడం ఇదే మొదటిసారి. అంతేకాదు సమీప భవిష్యత్తులో కూడా ఉద్యోగుల తొలంగింపు కొనసాగుతుందన్న సంకేతాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.

రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో టాప్ -10 ఐటీ కంపెనీలు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) ప్రథమార్ధం (ఏప్రిల్‌-సెప్టెంబర్‌)లో 51,744 ఉద్యోగాలు పోయాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, కాగ్నిజెంట్‌, ఎంఫసిస్‌, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, ఎల్‌టీఐమైండ్‌ట్రీల్లో ఈ ఏడాది మార్చి 31నాటికి  21.1 లక్షలకుపైగా ఉద్యోగాలు ఉండేవారు. అయితే ఈ సంఖ్య సెప్టెంబర్‌ 30కి 20.6 లక్షలకు తగ్గిపోయింది. గడిచిన 25 ఏళ్లలో ఇదే గరిష్ఠమని డాటా అగ్రిగేటర్‌ వేదిక స్టాటిస్టా తెలిపింది.

వాస్తవానికి భారతీయ ఐటీ రంగానికి ఇంటర్నేషనల్ మార్కెట్ కీలకం. అయితే ఈ క్రమంలోనే అమెరికా, ఐరోపా తదితర గ్లోబల్ మార్కెట్లో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనం అనేవి దేశీయ ఐటీ కంపెనీలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతం ఐటీ రంగానికి ఇదో పరీక్షా కాలమని నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఉన్న టాప్-10 కంపెనీల్లో ఒక్క ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ తప్ప మిగతా కంపెనీలు భారీగా ఉద్యోగుల్ని తగ్గించుకున్నాయి. ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌ కేవలం 32 మందినే ఈ జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఉద్యోగాల్లోకి తీసుకుంది. అయితే సంస్థ ఉద్యోగుల సంఖ్య ఎప్పుడూ లేనివిధంగా 22,265కి చేరింది.

Also Read: కేటీఆర్, రేవంత్ రెడ్డి ఫోన్లు హ్యాక్?.. యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్!

మరోవైపు ఐటీ రంగంలో స్థిరపడాలనుకునేవాళ్లకి ప్రస్తుతం గడ్డుకాలమే నడుస్తున్నదని నిపుణలు చెబుతున్నారు. గ్లోబల్‌ కస్టమర్లు, ముఖ్యంగా పశ్చిమ దేశాల నుంచి ఆర్డర్లు చాలావరకు తగ్గిపోవడమనేది భారతీయ ఐటీ సంస్థల ఆదాయాన్ని దిగజార్చుతోందని చెబుతున్నారు. వాస్తవానికి గత ఆర్థిక ఏడాది (2022-23) వరకు పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ.. ఈ ఏడాది నుంచే ప్రతికూలంగా మారాయని అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల ఇప్పుడప్పుడే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లనూ ఆశించలేమని చెబుతున్నారు. కొన్ని దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఇలాంటి సంకేతాల్ని ఇస్తున్నాయి. అయితే దేశీయ ఐటీ రంగంలో ఇలాంటి వాతావరణం ఎక్కువరోజులు ఉన్నట్లైతే.. నిరుద్యోగం రేటు పెరగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ సెప్టెంబర్‌ 30 నాటికి ఏ సంస్థలో ఎంతమంది ఉన్నారంటే ?
సంస్థ : ఉద్యోగులు
టీసీఎస్‌ : 6,06,985
కాగ్నిజెంట్‌ : 3,45,600
ఇన్ఫోసిస్‌ : 3,28,764
విప్రో : 2,44,707
హెచ్‌సీఎల్‌ టెక్‌ : 2,21,139
టెక్‌ మహీంద్రా : 1,50,604
ఎల్‌టీఐమైండ్‌ట్రీ : 85,532
ఎంఫసిస్‌ : 33,771
పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌ : 22,842
ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ : 22,265

Advertisment
తాజా కథనాలు